Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

5న రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ దత్తా పర్యటన

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

సభ్యుల సహకారంతో ఏదో ఒక సామాజిక సేవ చేయాలనే తలంపుతో ముందుకు సాగుతున్నామన్నారు. రోటరీ క్లబ్‌ ఐకాన్స్‌ ఒక సొంత బ్రాండ్‌ సృష్టించుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తుందన్నారు.

విశ్వంవాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం:

రోటరీ క్లబ్‌ ఆఫ్‌ రాజమహేంద్రవరం ఐకాన్స్‌ ద్వారా విస్తృతంగా సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, ఈనెల 5వ తేదీన రోటరీ క్లబ్‌ క్లబ్‌ డిస్ట్రిక్ట్‌ గవర్నర్‌ రావూరి సుబ్బారావు (దత్త) అఫీషియల్‌ విజిట్‌ సందర్భంగా 25 కార్యక్రమాలకు రూపకల్పన చేసామని అధ్యక్షులు తీగెల రాజా తెలిపారు. రాజమహేంద్రవరం సిటీ, రూరల్‌, రాజానగరంలో రోటరీ క్లబ్‌ ఐకాన్స్‌ ద్వారా పలు సామాజిక సేవా కార్యక్రమాలను ఈనెల 5వ తేదీన డిస్ట్రిక్ట్‌ గవర్నర్‌ 3020 రావూరి సుబ్బారావు (దత్త) ప్రారంభిస్తారని రాజా స్థానిక తాడితోట అనుపమ గ్రాండ్‌లో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో వెల్లడిరచారు. రోటరీ క్లబ్‌ ఐకాన్స్‌కు తమ పాలకవర్గం బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తి కావస్తోందని, నిత్యం పాలకవర్గం, సభ్యుల సహకారంతో ఏదో ఒక సామాజిక సేవ చేయాలనే తలంపుతో ముందుకు సాగుతున్నామన్నారు. రోటరీ క్లబ్‌ ఐకాన్స్‌ ఒక సొంత బ్రాండ్‌ సృష్టించుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తుందన్నారు. సోమవారం ఉదయం 8 నుంచి రాత్రి 9 గంటల వరకు రోటరీ క్లబ్‌ గవర్నర్‌ సారధ్యంలో పలు కార్యక్రమాలను విజయవంతం చేయడానికి అందరూ సహకరించాలని కోరారు. 10 మహా వృక్షాలకు చికిత్స చేసి మళ్లీ ప్రతిష్ట చేస్తున్నామని, జనని పాఠశాలకు టివి/బెంచీలు, గురుకుల పాఠశాలలో రెండు కోర్టుల నిర్మాణం, 70 మంది హెచ్‌ఐవి/ఎయిడ్స్‌ బాధితులకు మూడు నెలలకు సరిపడా పౌష్టికాహారం, ఆర్టీసీ బస్టాండ్‌, తాడితోటలో సురక్షిత నీరందించే ఆర్‌ఓ ప్లాంట్‌ వంటివి తమ ప్రాజెక్టుల్లో ఉన్నాయన్నారు. మానవ చేసే మాధవ సేవ అన్న నానుడికి అర్థం చెబుతూ పనిచేస్తున్నామని అందరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేసారు. సమావేశంలో రోటరీ ఐకాన్స్‌ సెక్రటరీ పి.అనుకుమార్‌, కోశాధికారి గ్రంధి రాజా, ఇమ్మణి వెంకట్‌, ఎం.వెంకటేశ్వరరావు, జాన్‌ కమిడి,సాయితాతారావు, బిజినెస్‌ క్లబ్‌ సెక్రటరీ పి.భగవాన్‌ తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement