Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ప్రీమియర్ లీగ్ సీజన్10 క్రికెట్ టోర్నమెంట్ విజేత రాజా వారియర్స్ టీం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

క్రీడలు మనుషులలో ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని ఇస్తాయి
– డాక్టర్ టి.కే. విశ్వేశ్వరరెడ్డి

విశ్వంవాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం:

ప్రీమియర్ లీగ్ సీజన్10 క్రికెట్ టోర్నమెంట్ విజేత రా

రాజమహేంద్రవరం,విశ్వం వాయిస్ న్యూస్:

 

స్థానిక మున్సిపల్ కాలనీ గ్రౌండ్ నందు మున్సిపల్ కాలనీ ప్రీమియర్ లీగ్ సీజన్ 10 క్రికెట్ టోర్నమెంట్ లో 9 జట్లు పాల్గొనగా 40 రోజులపాటు లీగ్ మ్యాచ్ లు నిర్వహించగా రాజా వారియర్స్ మరియు వాంబే సూపర్ కింగ్స్ అనే రెండు జట్లు ఫైనల్ కి చేరుకున్నాయి. ఆదివారం నాడు ఉదయం ఫైనల్ మ్యాచ్ నిర్వహించగా ఫైనల్ మ్యాచ్ లో రాజా వారియర్స్ విజేతగా నిలిచింది.ఈ మున్సిపల్ కాలనీ క్రికెట్ ప్రీమియర్ లీగ్ సీజన్ 10 ఆర్గనైజర్స్ గా రఫీ, ఉమా, కోటలు వ్యవహరించారు.బహుమతి ప్రధాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన డాక్టర్ టి.కే. విశ్వేశ్వర రెడ్డి, బూసి వజ్రనాథ్, నామాన వాసు, వి.కే. బిర్యానీ నాగార్జునలతో కలిసి విజేతగా నిలిచిన రాజా వారియర్స్ జట్టు సభ్యులకు మెమెంటో ఇచ్చి మెడల్స్ వేసి సత్కరించారు.

రన్నర్ గా నిలిచిన వాంబే సూపర్ కింగ్స్ జట్టు సభ్యులకు మెమెంటో లు ఇచ్చి సత్కరించారు.డాక్టర్ టీ.కే. విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ క్రీడలు మనుషులలో ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని ఇస్తాయని ఆరోగ్యం కూడా బాగా ఉంటుందని అనారోగ్యంను దరిచేరనీయవని అందువలన ప్రతి ఒక్కరు ఏదో ఒక క్రీడా ప్రతిరోజు ఆడుతూ ఉండాలని అన్నారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 42 వార్డు ఇంచార్జ్ నామాన వాసు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఈ విధంగా క్రికెట్ ప్రీమియర్ లీగ్ పోటీలను నిర్వహిస్తున్న నిర్వాహకులైనటువంటి రఫీ, ఉమా, కోట, ఎండి. వజీర్, పురుషోత్తం, వీ.కే. బిర్యాని నాగార్జున, ఎం.ఏ. రషీద్ లను అభినందించి మాట్లాడుతూ క్రీడలు మనుషుల లో క్రీడా స్ఫూర్తితో పాటు మంచి వాతావరణం కూడా కలిగిస్తాయని అన్నారు.బూసి వజ్రనాథ్ మాట్లాడుతూ ఇటువంటి క్రీడా పోటీల నిర్వహణకు ఆర్థిక సహకారం అందిస్తున్న టి.కే. విశ్వేశ్వర రెడ్డి, నామాన వాసు.వివేక్ బిర్యాని నాగార్జున సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి సంవత్సరం క్రికెట్ ప్రీమియర్ లీగ్ పోటీలు మున్సిపల్ కాలనీ గ్రౌండ్లో నిర్వహించడం నెగ్గిన జట్లకు బహుమతి ప్రధానం చేయడం ఆనందంగా ఉందని అన్నారు.

ఈ సందర్భంగా పొట్టి సురేష్ క్రికెట్ ప్రీమియర్ లీగ్ సీజన్ 10 ఆర్గనైజింగ్ కమిటీ వారు ఇటీవల సామాజిక సేవలో గౌరవ డాక్టరేట్ బ్రిటిష్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ క్వీన్ మేరీ నుండి పొందిన టి.కే. విశ్వేశ్వర రెడ్డి నీ సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో విన్నర్ మరియు రన్నర్ గా నిలిచిన జట్ల సభ్యులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement