విశ్వంవాయిస్ న్యూస్, రామచంద్రపురం:
రామచంద్రపురం నియోజకవర్గం విశ్వం వాయిస్ న్యూస్:-రామచంద్రపురం నియోజకవర్గం శెట్టిబలిజ సంఘ కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైనది.ఈ సందర్బంగా మంగళవారం నాడు రామచంద్రపురం పట్టణంలో శెట్టిబలిజ సంఘ భవనంలో ఏర్పాటుచేసిన నియోజకవర్గ తాలూకా శెట్టిబలిజ సంఘ సర్వసభ్య సమావేశం జరిగింది.ఈకార్యక్రమంలో నియోజకవర్గ తాలూకా శెట్టిబలిజ అభివృద్ధి వివిధ అంశాలపై చర్చించి తదుపరి కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా దొంగల శ్రీధర్ ఉపాధ్యక్షులుగా పంపన శ్రీనివాసు,పెంకె విశ్వేశ్వరరావు కార్యదర్శిగా కోట శ్రీనివాసరావు పామర్రు శ్రీను మరియు కార్యవర్గ సభ్యులును ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో రామచంద్రపురం నియోజకవర్గ కే గంగవరం కాజులూరు రామచంద్రపురం మరియు రామచంద్రపురం పట్టణం కార్యవర్గ సభ్యులు ఏకాభిప్రాయంతో పై కార్య వర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా అధ్యక్షులు దొంగల శ్రీధర్ మాట్లాడుతూ తాలూకా శెట్టిబలిజ సంఘాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ శెట్టిబలిజ ప్రముఖులు మేధావులు తదితరులు పాల్గొన్నారు.