విశ్వంవాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం:
రాజమహేంద్రవరం, విశ్వం వాయిస్ న్యూస్:
శ్రీ నీలకంఠం మహాదేవ ఎంటర్టైన్మెంట్ నిర్మాణ సంస్థ సారధ్యంలో రాజమండ్రి కి చెందిన పవన్ కుమార్ కొత్తూరి నటించి, దర్శకత్వం వహించిన యావరేజ్ స్టూడెంట్ నాని చిత్రం యూనిట్ రాజమండ్రిలో శనివారం సందడి చేసింది. స్థానిక శివ జ్యోతి థియేటర్లో ప్రదర్శతమవుతున్న యావరేజ్ స్టూడెంట్ నాని చిత్ర ప్రదర్శనను యూనిట్ బృందం అభిమానుల మధ్య తిలకించింది. ఈ సందర్భంగా నటుడు, చిత్ర దర్శకుడు పవన్ కుమార్ కొత్తూరి మాట్లాడుతూ, యూత్ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కించిన ఈ చిత్రం అన్ని వర్గాల వారిని ముఖ్యంగా యూత్ ను అలరించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ చిత్రాన్ని గోదావరి నది, కడియం పూల మొక్కల నర్సరీల అందాల మధ్య చిత్రీకరించినట్లు తెలిపారు. హీరోయిన్ లు సారా , బిశాల్ గోయల్ లు మాట్లాడుతూ తాము పోషించిన పాత్రలు ఎంతో ఎంటర్టైన్మెంట్ తో కథతో ముడిపడి ఉంటాయని ఆన్నారు. భవిష్యత్తులో మరిన్ని మంచి పాత్రలు లభిస్తాయని అభిలాషించారు.
ఈ చిత్రాన్ని యూత్ ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ చిత్రానికి నిర్మాతలు పవన్ కుమార్ కొత్తూరి తో పాటు బిశాల్ గోయల్, సంగీతం కార్తీక్ కొడకండ్ల, ఫైట్స్ నందు , కొరియోగ్రఫీ రాజు పాడే తదితర సాంకేతిక బృందం సహకారం అందించారు.