విశ్వంవాయిస్ న్యూస్, రామచంద్రపురం:
మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి సుభాష్
డిఎస్సి అభ్యర్థులకు ఉచిత కోచింగ్
విశ్వం వాయిస్ న్యూస్ రామచంద్రపురం నిరుద్యోగ యువత డీఎస్సీ మరియు టెట్ పరీక్షలకు సన్నద్ధం అయ్యేందుకు ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు.ఆదివారం ఉదయం రామచంద్రాపురం లోని బుచ్చిరాజు కళ్యాణమండపం నందు స్నేహితుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మీట్ ద ప్రెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమంలో భాగంగా రామచంద్రపురం లోని మీడియా ప్రతినిధులతో కలిసి కేకును కట్ చేసి స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య అధికంగా ఉన్న నేపథ్యంలో దీనిని గుర్తించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ఉద్యోగ నియామకమైన డీఎస్సీ మీద తొలి సంతకం చేశారని,ఐదవ సంతకం నైపుణ్య గణన మీద చేశారని పేర్కొన్నారు. నిరుద్యోగ సమస్యను నిర్మూలించడానికి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకొచ్చే విధంగా అన్ని చర్యలను చేపడు తోందన్నారు.డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా జాబ్ మేళాలు నిర్వహించి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే కార్యక్రమం చేపడుతున్నామని తెలియజేసారు.అందులో భాగంగా రామచంద్రపురం వి ఎస్ ఎం కాలేజీలో నిర్వహించిన జాబ్ మేళాలో ఇప్పటివరకు 850 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందని తెలిపారు.నేటి పోటీ ప్రపంచంలో ఉద్యోగాలు సాధించడం ఎంతో శ్రమ ఖర్చుతో కూడిన విషయమని,ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రామచంద్రపురం వి.ఎస్.ఎం కాలేజీలో డీఎస్సీ మరియు టెట్ పరీక్షలకు సంబంధించి ఉచిత కోచింగ్ సెంటర్ ను ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు.దీనికి సంబంధించిన బ్రౌచర్ ను ఆయన ఆవిష్కరించారు.ఈ కోచింగ్ సెంటర్లో జనరల్ నాలెడ్జ్ మనో విజ్ఞాన శాస్త్రం ఇంగ్లీష్ తెలుగు గణితం సైన్స్ సోషల్ లో మంచి ప్రావీణ్యత కలిగిన బోధన సిబ్బందితో శిక్షణ ఇస్తామన్నారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల తో నాణ్యత కలిగిన స్టడీ మెటీరియల్ అందించి శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లాలను నిరుద్యోగ యువత అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. ఆగస్టు 11 వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతుందని.ఆగస్టు 13 నుంచి శిక్షణ తరగతుల ప్రారంభమవుతాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.వివరాలకు 8096523666 ఫోన్ నంబర్ ను సంప్రదించాలన్నారు.
మీడియా ప్రతినిధులకు త్వరలో ఇళ్ల స్థలాలు మంజూరు అయ్యేలా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.