Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి – జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షురాలు డాక్టర్ అనసూరి పద్మలత..

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి.
– జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షురాలు డాక్టర్ అనసూరి పద్మలత..
– బీసీ బిల్లుకు ఎవరైతే సహకరిస్తారో వారిని ప్రధానమంత్రి చేయాలి.

విశ్వంవాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం:

రాజమహేంద్రవరం,విశ్వం వాయిస్ న్యూస్:

స్థానిక సంస్థల్లో బీసీలకు ,మహిళలకు ఉన్న రిజర్వేషన్ ఆధారంగా చేసుకుని పార్లమెంట్ లో బీసీ బిల్లు ప్రవేశ పెట్టవచ్చు.అదేవిధంగా గత పార్లమెంటు 2023 లో ఆమోదించిన మహిళా బిల్లు 2024 ఎన్నికల్లో అమలు చేయవచ్చు. ప్రత్యేకంగా మరలా జనగణన చేయనవసరం లేదు. రాజ్యాంగంలో రిజర్వేషన్లు ఎక్కడా ఇంత పరిధి దాటి ఇవ్వకూడదు అని చెప్పలేదు. దామాషా పద్ధతిలోగత వైసిపి ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీ లకు 50 శాతం ఇద్దామని ప్రతిపాదిస్తే కోర్టు అభ్యంతరం చెప్పడంతో బీసీ లకు 27 శాతంతో సరిపెట్టవలసి వచ్చింది. ఆర్థికముగా వెనుకబడిన వారికోసం తప్పనిసరిగా రిజర్వేషన్ అవసరం. వారికి ఇచ్చిన 10 శాతంతో 50 శాతం రిజర్వేషన్ అధిగమించినపుడు, మన దేశ జనాభాలో 56 శాతం ఉన్న బీసీ లకు దామాషా పద్ధతిలో రిజర్వేషన్ కల్పించడంలో కోర్టు అభ్యంతరం చెప్పడం అన్యాయం.

 

అదేవిధంగా ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో 48 లక్షల కోట్ల దేశ బడ్జెట్ లో బీసీ సంక్షేమానికి కేవలం 2 ,400 కోట్లు మాత్రమే కేటాయించడం చాలా బాధాకరం.

రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ లకు ప్రత్యేక బీసీ సంక్షేమ శాఖ ఉండగా కేంద్రంలో బీసీ లకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేక పోవడం బిసిల సంక్షేమం పట్ల రాజకీయ పార్టీలకు చిత్త శుద్ధి లేక పోవడమే.

దేశ జనాభాలో56 శాతం పైగా ఉన్న బీసీ లు అసెంబ్లీ మరియు పార్లమెంట్ లో 15 నుండి 18 శాతం మాత్రమే ఉండటం బీసీ లకు రాజ్యాధికారంలో ఎంత అన్యాయం జరుగుతుంది తెలియచేస్తుంది. సమగ్ర కులజనగణన, బీసీ బిల్లు మాత్రమే బీసీల ఆర్థిక, రాజకీయ సాధికారతకు సోపానాలు.

ఈ కార్యక్రమాన్ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు గుజ్జు సత్యం ఆధ్వర్యంలో నిర్వహించారు,ఈకార్యక్రమాని కి ముఖ్య అతిథిగా జాతీయ బీసీ సంక్షేమం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య, బీద మస్తాన్ రావు,బాబురావు, విజయనగరం ఎంపీ అప్పలనాయుడు,

ఎంపీ మల్లు రవి, మాజీ ఎంపీ వీ.హెచ్ హనుమంతరావు, బిసి నాయకులు గుజ్జు కృష్ణ,నీలం వెంకటేష్,లాకా వెంగళరావు, రామ కృష్ణ,తెలంగాణ రాష్ట్ర బీసీ నాయకురాలు మట్ట జయంతి గౌడ్,

జాతీయ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కొల్లెపల్లి సుభాషిణి,

బీసీ నాయకులు బూడిద శరత్ కుమార్, పెంకే మారేష్, పెంకే శ్రీనివాస్, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ మహేష్, తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement