విశ్వంవాయిస్ న్యూస్, రామచంద్రపురం:
మోడరన్ కాలేజీ ఫ్రెషర్స్ డే వేడుకల్లో పాల్గొన్న మంత్రి సుభాష్
విశ్వం వాయిస్ న్యూస్ రామచంద్రపురం మోడరన్ జూనియర్ కాలేజీ ఫ్రెషర్స్ డే వేడుకలు శనివారం విజయ్ ఫంక్షన్ హాల్ నందు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి విశిష్ట అధితిగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ హాజరయ్యారు.ఈ సందర్బంగా మంత్రి మోడరన్ జూనియర్ కాలేజీ స్టాఫ్ ని ఘనంగా సత్కరించారు.ఈ సందర్బంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ యువత స్పష్టమైన లక్ష్యం కలిగి ఉండాలని, దురలవాట్లకు దూరంగా ఉండాలని స్పష్టం చేసారు.విద్యార్థులకు ఉన్నత భవిష్యత్ కలుగజేసే ఆశయంతో మోడరన్ విద్యాసంస్థలను నిర్వహిస్తున్న జి.వి.రావు ఆదర్శప్రాయుడని అభినందించారు.అలాగే రామచంద్రపురం మునిసిపల్ కమీషనర్ బి. శ్రీనివాసులు మరో ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈసందర్బంగా రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన మెరిట్ విద్యార్థులకు కమిషనర్ ప్రోత్సాహక బహుమతులు అందజేసారు.అనంతరం కమీషనర్ మాట్లాడుతూ గురువు సాక్షాత్తు
పర బ్రహ్మ స్వరూపం అని, అలాగే తల్లిదండ్రులు దైవ సమానులు అని విద్యార్థులకు హితవు పలికారు.గ్రామీణ ప్రాంతాల విద్యార్థులను రాష్ట్ర స్థాయి ర్యాంకర్స్ గా తీర్చిదిద్దుతున్న మోడరన్ విద్యాసంస్థల అధినేత లయిన్
జి.వి.రావు కృషి అభినందనీయం అని పేర్కొన్నారు.అనంతరం జి. వి.రావు మాట్లాడుతూ విద్యార్థులకు ఉన్నతమైన అత్యుత్తమ ప్రమాణాలతో అందజేయడానికి మోడరన్ నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు. కమీషనర్ శ్రీనివాసులకు మోడరన్ ఫౌండేషన్ తరపున ప్రజాహిత పురస్కారం అందజేసారు.ఇంటర్ ప్రిన్సిపాల్ సి.హెచ్.రాజేష్ మాట్లాడుతూ విద్యార్థులతో ఉన్న క్రియేటివ్ స్కిల్స్ పెంపొందించుటకు ఈ కార్యక్రమాలు ప్రతీ సంవత్సరం క్రమం తప్పకుండ నిర్వహిస్తున్నామని తెలిపారు.డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ పి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్యార్థులకు ఆటవిడుపుగా ఇటువంటి ఫ్రెషర్స్ డే వేడుకలు దోహదం చేస్తాయని అన్నారు.కార్యక్రమంలో డిగ్రీ కాలేజీ అకడమిక్ డైరెక్టర్ కె.సాయిరాం చౌదరి,మోడరన్ వైస్ ప్రిన్సిపాల్ పి.ఎస్.ప్రకాష్, అకడమిక్ అడ్వైజర్ సి. హెచ్.శ్రీనివాస్,మోడరన్ కాలేజీ స్టాఫ్,విద్యార్థులు పాల్గొన్నారు.