విశ్వంవాయిస్ న్యూస్, రామచంద్రపురం:
పాఠశాల కమిటీ చైర్మన్ గా మేడిశెట్టి
విశ్వం వాయిస్ న్యూస్ రామచంద్రపురం
విద్యాశాఖ అధికారుల ఆదేశాలు మేరకు రామచంద్రపురం మండలం తాళ్ళపొలంలో ప్రాధమికోన్నత పాఠశాల మేనేజ్ మెంట్ కమిటీ ఎన్నిక తల్లిదండ్రుల సమక్షంలో ప్రధానోపాధ్యాయుని ఆధ్వర్యంలో జరిగింది.ఈసందర్బంగా మేడిశెట్టి వీర వెంకట రమణ ఛైర్మన్ గా,సిగిరెడ్డి వరలక్ష్మి వైస్ ఛైర్మన్ గా పాఠశాల కమిటీ సభ్యులు అందరూ ఎన్నుకోవడం జరిగింది.అనంతరం తాళ్ళపొలం సర్పంచ్ కట్టా గోవిందు,ఎంపిటిసి సభ్యులు పంపన ఏడుకొండలు ప్రమాణ స్వీకారం చేయించారు. ఎన్నికైన వారు పాఠశాల విద్యాభివృద్ధికి మరియు పాఠశాల అభివృద్ధి కి పాటుపడాలని ప్రధానోపాధ్యాయులు లక్ష్మణరావు తెలియజేశారు.ఎన్నికైన వారిని అభినందిస్తూ, సహకరించిన తల్లి తండ్రులకు ధన్యవాదాలు తెలిపారు .ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు అభినందించారు.