విశ్వంవాయిస్ న్యూస్, రామచంద్రపురం:
కార్మిక శాఖా మంత్రి సుభాష్ కి APTA ఆహ్వానం
జనవరి 4,5 తేదీల్లో హైదరాబాద్ హైటెక్స్ లో బిజినెస్ కాన్ఫరెన్స్
విశ్వం వాయిస్ న్యూస్ ఆప్తా క్యాటలిస్ట్ – గ్లోబల్ బిజినెస్ ఫోరమ్ ఆధ్వర్యంలో 2025 జనవరి 4,5 తేదీల్లో హైదరాబాద్ హైటెక్స్ లో జరిగే గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ కు ఆహ్వానం పలికారు. శనివారం ఆప్తా బిజినెస్ ఫోరమ్ కాన్ఫరెన్స్ సెక్రటరీ నల్లం చంద్రశేఖర్ (యూఎస్ఏ) రామచంద్రాపురం ఎమ్మెల్యే కార్మిక శాఖామంత్రి వాసంశెట్టి సుభాష్ కలిసి ఆహ్వానం పలికారు. సుమారు పది కోట్ల వ్యయంతో,ప్రపంచ దేశాలలోని వేలాదిమంది వ్యాపార,వాణిజ్య, పారిశ్రామిక దిగ్గజాలతో జరగబోయే ఈ కార్యక్రమానికి ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరియు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విశిష్ట అతిథులుగా రాబోతున్నారు అని నల్లం చంద్ర శేఖర్ వివరించారు.పదహారు సంవత్సరాల నుండి తమ సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమాలు,వితరణలు వివరించారు.