విశ్వంవాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం:
రాజమహేంద్రవరం, విశ్వం వాయిస్ న్యూస్:
జిల్లా సీనియర్ ఫోటోగ్రాఫర్ ,ఏ సిటీ స్టాఫ్ రిపోర్టర్, కే.టి.వి చైర్మన్ సీనియర్ విలేకరి ఆర్కె (రామకృష్ణ) జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ రామకృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఆంధ్రసింహం సీనియర్ విలేఖరి సోమరాజు ఆధ్వర్యంలో రాజమండ్రి లోని ప్రముఖ హోటల్లో రామకృష్ణ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విలేకరులు పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.రాజమండ్రి ప్రెస్ ప్రెస్ క్లబ్లో క్రైస్తవ సంఘాల నాయకులు ఆర్కే జన్మదిన సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేసి ఆశీస్సులు అందజేశారు.ఈ కార్యక్రమంలో సీనియర్ విలేకరి గోధూళి దినపత్రిక ఎడిటర్ దుమ్ముల అబ్రహం లింకన్, ఏబీసీ ఛానల్ సిఈ ఓ అత్తులూరి కిషోర్, ప్రముఖ సీనియర్ విలేకరి కొత్తపల్లి సుబ్బారావు, విశ్వంవాయిస్ స్టాప్ రిపోర్టర్ కుడెల్లి రత్నకిషోర్,ఆర్ టి వి ఛానల్ స్టాఫ్ కెమెరామెన్ బాలు తదితరులు పాల్గొన్నారు