Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

కిక్ బాక్సింగ్ క్రీడను ప్రోత్సహించడానికి స్టేడియం రింగ్ ను ఏర్పాటు చేయాలి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

ముఖ్య అతిధి గా టీడీపీ రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ జ్యోతి ప్రజ్వలన చేసి కంపిటేషన్స్ ప్రారంభించారు.

విశ్వంవాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం:

కిక్ బాక్సింగ్ క్రీడను ప్రోత్సహించడానికి స్టేడియం రింగులు ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షులు ఆనంద బాలు అన్నారు.రాజమహేంద్రవరం 31వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలు రాజమండ్రిలో ఎస్కేవిటి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో రెండు రోజులు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా టీడీపీ రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ జ్యోతి ప్రజ్వలన చేసి కంపిటేషన్స్ ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో కిక్ బాక్సింగ్ జాతీయ అధ్యక్షులు సంతోష్ కె.అగర్వాల్, రాష్ట్ర అధ్యక్షులు జి.ఆనంద్ బాలు రాష్ట్ర కార్యదర్శి పి.ఆనంద్ ఆచార్య రాజమండ్రి కిక్ బాక్సింగ్ ఛైర్మెన్ రొంపిచర్ల ఆంటోనీ దాస్ ఆధ్వర్యంలో రవిరామ్ కిరణ్ శాలువాతో సత్కరించి జ్ఞపికను అందజేశారు.‌ఈ సందర్బంగా గోరంట్ల రవిరామ్ కిరణ్ మాట్లాడుతూ ఈరోజు రాజమండ్రి ఎస్ .కే.వి.టీ పాఠశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీల లో రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది క్రీడా కారులు పాల్గొన్నారని తెలిపారు. ఈ పోటీలు నిర్వాహస్తున్న 17 వ వార్డ్ టీడీపీ ఇంచార్జి రొంపిచర్ల ఆంటోనీ దాస్, కిక్ బాక్సింగ్ అసోసియేషన్ కు అయన శుభాకాంక్షలు తెలిపారు . ఇటీవంటి క్రీడలు ఎంతో మంది యువతి యువకులకు స్ఫూర్తిగా తీసుకుని యువత అనేక క్రీడాల్లో రాణించాలని పిలుపునిచ్చారు. ఇప్పటివరకు కిక్ బాక్సింగ్ సరైన స్థలం లేకపోవడం చాలా బాధకారం అని అన్నారు. త్వరలోనే రాజమహేంద్రవరం రూరల్ శాసన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి దృష్టికి తీసుకువెళ్లి కిక్ బాక్సింగ్ కోర్ట్ కి స్థలం ఏర్పాటు చేసే విధంగా ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. కిక్ బాక్సింగ్ పోటీలలో ఓవరాల్ ఛాంపియన్ గా విశాఖపట్నం క్రీడాకారులు గెలుపు పొందినట్లు తెలిపారు. అలాగే రెండో స్థానంలో రాజమండ్రి క్రీడా కారులు‌‌ గెలుపొందారని అన్నారు. మూడో స్థానంలో కాకినాడ జిల్లా రామచంద్రపురం క్రీడాకారులు గెలుపొందారని తెలిపారు.ఈ కార్యక్రమంలో 28 వ వార్డ్ ఇంచార్జి శీలం గోవింద్,చీఫ్ ఆర్గనైజర్ ఎం. గణేష్, ఆర్గనైజర్ ఎన్. గిరి వెంకట రమణ,స్టేట్ కోచ్ గా ఎం. భవాని శంకర్, రొంపిచర్ల ఆంటోనీ దాస్ వారి మిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement