విశ్వంవాయిస్ న్యూస్, రామచంద్రపురం:
మొక్కలు మనుషుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయా ?
భూగర్భ జలాలను మింగేస్తున్న చెట్లు
మానవ మనుగడకు మరణ మృదంగం మొగుస్తున్న మొక్కలు
స్వాత్రంత్ర దినోత్సవం సందర్బంగా కోనోకార్పస్ మొక్కలను నిర్ములించే కార్యక్రమం ప్రభుత్వం ప్రారంభించాలి
విశ్వం వాయిస్ న్యూస్ రామచంద్రపురం :-వృక్షశాస్త్ర నిపుణులు చెబుతున్నట్టుగా మొక్కలు మనుషుల ఆరోగ్యాలను ప్రభావితం చేయగలుగుతాయా అన్న అంశంపై చాలా ప్రయోగాలు జరిగాయి. కొన్ని రకాల మొక్కలు మనుషుల చర్మం, శ్వాసవ్యవస్థలపై ప్రభావితం చూపుతాయన్నది కొన్నిరకాల పరిశోధనల్లో కూడా తెలిసింది.సాధారణంగా పార్థీనియం, పొద్దుతిరుగుడు,ఉమ్మెత్త, చామంతి,మందార, గులాబీ మొక్కల పుప్పొడి రేణువులు తాకడం వల్ల కొంతమందికి స్కిన్ అలర్జీ రావటం.ఒకవేళ తెలియకుండా వాటి వాసన పీల్చినా శ్వాసనాళాలు, ఊపిరితిత్తుల్లో కొన్ని రసాయనాలు విడుదలై శ్లేష్మం(మ్యూకస్) పెరిగిపోయి కఫం,దగ్గు, శ్వాసలో ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది. వైద్యపరిభాషలో దీన్ని (అలర్జిక్ బ్రాంకైటిస్ ) బ్రాంకిల్ హైపర్ రియాక్టివిటీ అని పిలుస్తారు. కొంతమందిపై కొన్ని రకాల మొక్కలు ప్రభావం చూపుతాయి.ఇదివరకే ఆస్థమా,చర్మసంబంద అలర్జీ ఉన్నవారిపై ఇవి ఎక్కువ ప్రభావం చూపుతాయి.ఈరకం అలర్జీలకు చికిత్స ఉంది.
అయితే శంఖు రూపంలో( కోన్ ఆకారం)లో పచ్చగా, అందంగా, ఆకర్షణీయంగా కనిపించే కోనోకార్పస్ మొక్కలు లేదా చెట్లు రహదారుల వెంబడి డివైడర్లలో ఎక్కువగా కనిపిస్తుంటాయి.నగరాల్లో పచ్చదనాన్ని పెంచేందుకు వివిధ దేశాలు గుబురుగా పెరిగే ఈచెట్లను ఆదరించాయి.
భారత్,పాకిస్తాన్,అరబ్, మధ్యప్రాచ్య దేశాల్లో ఈ మొక్కలను రహదారులు, గార్డెనింగ్,కమ్యునిటీ,అవెన్యూ ప్లాంటేషన్లలో భాగంగా విస్తృతంగా పెంచారు.ఆ తర్వాత ఆయా ప్రభుత్వాలు తమ నిర్ణయంపై వెనక్కి తగ్గి మొక్కలు నిర్మునిలించే ప్రయత్నం చేస్తున్నాయి.
కోనోకార్పస్ పర్యావరణ, ఆరోగ్య సమస్యలకు కారణం అవుతోందని వృక్ష,పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈకారణంగా కోనోకార్పస్ మొక్కల పట్ల వ్యతిరేకత ప్రారంభమైంది.
తెలంగాణతో పాటూ మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో కోనోకార్పస్‌పై విస్తృత చర్ఛ సాగింది. మహారాష్ట్రలో ‘పుణె’ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే పబ్లిక్ పార్కులలో కోనోకార్పస్ మొక్కల పెంపకాన్ని చేపట్టొద్దని స్థానిక పర్యావరణవేత్తలు ప్రభుత్వాన్ని కోరారు.
అయితే తెలంగాణలో కూడా క్షేత్రస్థాయి పర్యటనల్లో, గ్రామపంచాయతీల నర్సరీల్లో పెంచుతున్న కోనోకార్పస్ మొక్కలు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ హరితహారంలో భాగంగా ఎక్కువగా నాటుతున్నట్టుగా తమ దృష్టికి వచ్చిందని,విదేశీ జాతికి చెందిన ఈమొక్క వల్ల పర్యావరణ, ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని,అందుకే వీటి పెంపకాన్ని ప్రోత్సహించవద్దని తెలంగాణ పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ది శాఖ కమీషనర్ ఇటీవల జిల్లా గ్రామీణ అభివృద్ది అధికారులకు లిఖిత పూర్వక ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది.
అరబ్,మధ్యప్రాచ్య దేశాల్లో కోనోకార్పస్‌ను (దమన్)అని పిలుస్తారు. పచ్చదనంతో పాటు వాతావరణంలో వేడి నియంత్రిస్తుందని,ఎడారి వాతావరణంలో దుమ్ము, ధూళి,గాలితో పాటు వచ్చే ఇసుకను అడ్డుకుంటుందని ఆ దేశాలు కోనోకార్పస్‌ను పెద్ద సంఖ్యలో పెంచాయి.
అయితే,ఇప్పుడు కువైట్, ఖతార్,యూఏఈ లాంటి దేశాలు నర్సరీల్లో దీని పెంపకం,దిగుమతులను నియంత్రించాయి.
సహజంగా మాంగ్రూవ్ జాతి మొక్కలు బలమైన వేర్లు కలిగి ఉంటాయి. దీంతో,అవి భూగర్భంలో చొచ్చుకుపోయి అండర్ గ్రౌండ్ గుండా వేసిన కమ్యూనికేషన్,తాగునీరు, డ్రైనేజీ పైపులైన్‌లకు నష్టం చేస్తాయి.గోడలు,ఇతర నిర్మాణాలు వీటి వేర్లతో దెబ్బతింటాయి.అదే సందర్భంలో ఈ మొక్క పండ్లు,పుష్పాలు తినేందుకు పనికిరావు. కనీసం పక్షులు గూడు కట్టుకునేందుకు కూడా ఈ చెట్టు పనికి రాదు.కేవలం అందం,ఆకర్షణ తప్ప ఇతర ఉపయోగాలు లేవు. భూగర్భ జలాలను ఎక్కువగా వినియోగిస్తుంది.అందుకే స్వదేశీ మొక్కలైన చింత, వేప,మర్రి,పొగడ, ఆకాశమల్లె లాంటి చెట్లను నాటాలని వృక్షశాస్త్ర నిపుణులుగా ప్రభుత్వాలను కోరుతున్నాయి.
గతంలో పాకిస్తాన్‌లోని కరాచీ,ఇస్లామాబాద్ క్యాపిటల్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో ఈమొక్కలు పెంచడంపై స్థానిక పర్యావరణవేత్తలు ప్రభుత్వానికి తమ ఆందోళన వ్యక్తం చేసారు.
కరాచీ యూనివర్సిటీ బాటనీ విభాగం ఆధ్వర్యంలో కోనోకార్పస్‌తో పాటు ఇతర 32 జాతి మొక్కల వల్ల అక్కడి వాతావరణంలో ముఖ్యంగా గాలి నాణ్యతపై ప్రభావం పడుతోందన్న అంశంపై ఎయిరోబయాలజిస్ట్‌లు పరిశోధనలు నిర్వహించారు.కరాచీలో ఆస్థమా పేషంట్ల సంఖ్య ఎక్కువగా ఉందని, అందుకు ఈమొక్కలే కారణమని అందులో తేలింది.దేశవాళీ చెట్లనే పెంచాలని అక్కడి వృక్షశాస్త్రవేత్తలు సూచించారు.
భారీ ఎత్తున మొక్కలు నాటే హరితహారం లాంటి కార్యక్రమాల్లో దేశవాళీ మొక్కలనే నాటాలని బోటనిస్టులు సూచిస్తున్నారు.
అందువలన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని ఈ మొక్కల ఎక్కడ ఉన్నవో గుర్తించి వాటిని తొలగించి మన మొక్కలను నాటేలా ఒక ఉద్యమంలా కార్యక్రమం మొదలు పెట్టాలని.ఈ కార్యక్రమానికి ప్రజలు కుడా పాల్గొన్ని సహాయ సకారాలు అందించే విధంగా కృషి చేయాలనీ ఆశిస్తూ,ఈ స్వాత్రంత్ర దినోత్సవం సందర్బంగా ఈ కార్యక్రమం ప్రారంభించాలని కోరుకుంటూ
శ్రీనివాస్
రామచంద్రపురం (రీపోటర్ )