WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

ఘనంగా రాజమండ్రి ఆదిత్యలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు 

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

డాక్టర్ జి .వి. ఎస్.నాగేశ్వరరావు ఆధ్వర్యంలో విద్యార్థులు వందేమాతర గీతం ఆలాపన,

ప్రవీణ్, వంశీ,ఆకాష్, గాయత్రి, రేణుక తదితర విద్యార్థులు ఎందరో త్యాగధనుల చేసిన పోరాట ఫలమును మనం అనుభవిస్తున్నామని తెలియజేశారు.

విశ్వంవాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం:

రాజమహేంద్రవరం, విశ్వం వాయిస్ న్యూస్:

రాజమహేంద్రవరం స్థానిక ఆదిత్య డిగ్రీ కళాశాల మరియు మహిళా డిగ్రీ కళాశాలల సంయుక్త ఆధ్వర్యంలో ఎన్.ఎస్.ఎస్ మరియు యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్లు వందమంది ఎన్ఎస్ఎస్ లీడర్ చరణ్ ఆదర్శ్ నాయకత్వంలో అతిధులను తమ టీం వాలంటీర్లతో, మార్చింగ్ చేస్తూ,అనేక విన్యాసాలతో విద్యార్థిని విద్యార్థులను అలరించుతూ తీసుకురావడం విశేషం. ఈ కార్యక్రమాన్ని డాక్టర్ జి .వి. ఎస్.నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ముందుగా ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థులు వందేమాతర గీతం ఆలపించగా ,రాజమండ్రి ఆదిత్య విద్యాసంస్థల డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి పతాకావిష్కరణ చేశారు.

తదుపరి డా.బి హెచ్.వి. రమాదేవి తెలుగులో ప్రతిజ్ఞ చెప్పారు.ఈ కార్యక్రమానికి ప్రయోక్త గా డాక్టర్ బి హెచ్. వి .రమాదేవి నిర్వహించగా, డాక్టర్ సోను దుర్గాప్రసాద్ గాన, నృత్య రూపకల్పన ,సంగీత వాద్య సహకారాన్ని అందించారు. ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలకు చెందిన ఎన్.ఎస్.ఎస్ .ప్రోగ్రామ్ ఆఫీసర్ కె.. మహేశ్వరి, దేశభక్తి నృత్యాలను రూపొందించారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సిహెచ్. ఫణి కుమార్, కాంపిటేటివ్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్. కె .ఎన్ రెహమాన్, మేనేజ్ మెంట్ ప్రిన్సిపాల్ రామకృష్ణ,యానిమేషన్ ప్రిన్స్ పాల్ చంద్రశేఖర్లు పాల్గొన్నారు. ఆదిత్య విద్యార్ధులు దేశభక్తి గీతాలతో ,సాంస్కృతిక కార్యక్రమాలతోనూ అలరించారు. హరిప్రియ శాస్త్రీయ నృత్యంలో చక్కని భావనలు వ్యక్తీకరించడం పలువురనాకర్షించింది. జ్యోతిర్మయి నృత్యం, ఇంకా శాస్త్రీయ భక్తి నృత్యం , రంగీలా పాటకు నృత్యం, జయహో అనే పలు నృత్యాలు చూపరులను ఆకర్షించాయి. రీమిక్స్ నృత్యం. చేసిన విద్యార్థులు ఎంతో నైపుణ్యంతో చేశారు. కార్యక్రమం లో ప్రవీణ్, వంశీ,ఆకాష్, గాయత్రి, రేణుక తదితర విద్యార్థులు ఎందరో త్యాగధనుల చేసిన పోరాట ఫలమును మనం అనుభవిస్తున్నామని తెలియజేశారు. డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి మాట్లాడుతూ స్వాతంత్రోద్యమ చరిత్రను ఎందరో మహనీయుల యొక్క ఉద్యమ స్ఫూర్తిని, గాంధీజీ ,నేతాజీ, చాచాజీల కన్న కలలను నిజం చేయాల్సిన బాధ్యత విద్యార్థులదేనని, ఏడాదికి ఈ రెండు పండుగలు వస్తాయని, విద్యార్థులకు దేశభక్తి చాలా అవసరమని స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న ఝాన్సీ లక్ష్మీబాయి అల్లూరి సీతారామరాజు కొందరు అతివాదులు, మితవాదుల యొక్క చరిత్రను ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. తనను మార్చింగు చేస్తూ వేదిక మీదకు తీసుకువచ్చిన ఆదిత్య వాలంటీర్లను చూసి ఆదిత్య విద్యార్థులు రిపబ్లిక్ డే కు 20 మంది ఎంపిక అయ్యి ఢిల్లీ లో మార్చింగ్ చేశారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ విద్యార్థుల్లో ఉన్న సృజనని ప్రోత్సహిస్తూ పాల్గొన్న వారికి బహుమతులు అందించడం విశేషం. కార్యక్రమంలో దేశానికి వెన్నెముక లాంటి రైతు ఎంత ముఖ్యమో యువకులు అంత ముఖ్యమని సిహెచ్ ఫణి కుమార్ అనేక నృత్య కార్యక్రమాలతో, పాటలతో, మార్చింగులతో అలరించడం విద్యార్థులను అభినందించారు. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నామంటే అది ఎందరో నాయకుల యొక్క పోరాట ఫలితమేనని విద్యార్థులు చదువు ఒక్కటే కాకుండా జీవితానికి కావలసిన అన్ని నైపుణ్యాలను పెంపొందించుకోవాలని తెలియజేశారు. ఎస్ . కె.ఎన్.రెహమాన్ మాట్లాడుతూ తమ కళాశాలలో విద్యార్థులు అన్ని అవకాశాలను అందిపుచ్చుకొని పడి,పన్నెండు ఉద్యోగాలకు మించి ఎంపికై తమ విద్యా సంస్థ కీర్తిస్తున్నారని తెలిపారు. చంద్రశేఖర్ మాట్లాడుతూ తమ విద్యార్థిని రేణుక తన ఉపన్యాసంలో చక్కని విషయాలు తెలియజేసినందుకు తమ ఆనందం వ్యక్తం చేశారు., తమ కళాశాలకు చెందిన మేడం శ్రావ్యంగా భారతమాత గురించి పాట ఆలపించగా అభినందించారు. రామకృష్ణ విద్యార్థులందరినీ కూడా అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెరేడ్ లో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులకు సిహెచ్ ఫణికుమార్, డాక్టర్ బిహెచ్.వి. రమాదేవి, డాక్టర్ జి వి. ఎస్ .నాగేశ్వరరావు, ఎస్.కె.ఎన్ రెహమాన్, శ్రీనివాసరెడ్డి చంద్రశేఖర్లు మెడల్స్ బహూకరించారు. ఎన్.ఎస్.ఎస్ .లీడర్స్ చరణ్ ,ఆదర్శ్ లకు ప్రత్యేక బహుమతులు ప్రకటించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న అందరికీ వారిలో సృజనాత్మకత పెంపొందించుటయే తన లక్ష్యమని బహుమతులు ఇచ్చారు అనంతరం అది ఇచ్చే డిగ్రీ కళాశాల మరియు మహిళ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఆయన ఈ సందర్భంగా శాలువా జ్ఞాపకలతో, సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్స్ ఆనంద్, ప్రసాద్ తదితర అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొని స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.విద్యార్ధినీ,విద్యార్థులందరికీ. మిఠాయిలు పంచగా, జనగణమనతో కార్యక్రమం ముగిసింది.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement