విశ్వంవాయిస్ న్యూస్, రాయవరం
ఘనంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు
రాయవరం, విశ్వం వాయిస్ న్యూస్ :ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు జనసేన కార్యకర్తలు మండల కేంద్రం రాయవరం లో ఘనంగా నిర్వహించారు.
మండలంలో సోమవారం డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు జనసేన పార్టీ నాయకుల చిన్ని ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రజల మనిషిగా సమాజ శ్రేయోభిలాషిగా జనహితాన్ని కోరుకునే పవన్ కళ్యాణ్ నిండు నూరేళ్లూ ఆరోగ్య, ఆనందాలతో వర్థిల్లాలని ఈ సందర్భంగా పలువురు కొనియాడారు. అనంతరం కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ జన్మదిన పురస్కరించుకుని సుమారు 31 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఉండవిల్లి రాంబాబు, ఉండవిల్లి శ్రీను, చల్లా సత్యనారాయణ, వలి, దేవి శెట్టి కోటేశ్వరరావుజనసేన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.