11:38 PM, 1 Monday March 2021

డీఈఓ కార్యాలయ ముట్టడించిన ఉపాధ్యాయులు

కాకినాడ, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

ఉపాధ్యాయులకు సాధారణ బదిలీలు మాన్యులు కౌన్సిలింగ్ పద్ధతిలో జరగాలని ఏ ఒక్క ఉపాధ్యాయ ఖాళీలను బ్లాక్ చేయకూడదని డిమాండ్ల సాధనకై రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఉపాధ్యాయులు తూర్పుగోదావరి జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ముట్టడించడం జరిగిందన్ని జేఏసీ జిల్లా కన్వీనర్, యుటిఎఫ్ రాష్ట్ర అడిట్ కమిటీ కన్వీనర్ డి వి రాఘవులు తెలిపారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూవ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో చేస్తున్న రైతుల పోరాట స్పూర్తితో సమస్యల సాధనకై ఉపాధ్యాయులు ఉద్యమించాలన్నారు. ఎస్టియు రాష్ట్ర బాధ్యులు పి సుబ్బరాజు, ఫ్యాప్టో కో చైర్మన్ యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ఉపాధ్యాయుల, ఉపాధ్యాయ సంఘాల పట్ల విద్యాశాఖ అధికారులు నిరంకుశ వైఖరి విడనాడాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఉపాధ్యాయుల సమస్యల సాధనకై విద్యాశాఖ అధికారులు స్పందించకపోతే ఉద్యమం మరింత తీవ్రరూపం దాల్చుతుందని తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్యాప్టో జనరల్ సెక్రెటరీ టి వెంకట్రావు, యుటిఎఫ్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు ఎస్ జ్యోతిబసు, ఫ్యాప్టో భాగస్వామ్య సంఘ నాయకులు శివప్రసాద్ రవి నాగేశ్వరరావుతనీషా వెంకట రాజు తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#