రాయవరంలో తెదేపా మండల స్థాయి సమావేశం

రాయవరం, విశ్వంవాయిస్ న్యూస్:   మండల కేంద్రమైన రాయవరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల స్థాయి కమిటీ సమావేశం బుధవారం నిర్వహించారు. వుండవిల్లి రాంబాబు ఆధ్వర్యంలో, మండల పార్టీ అధ్యక్షుడు కొప్పిశెట్టి మాధవరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి తీర్మానాలు చేశారు. ముఖ్యంగా రాయవరం గ్రామంలోని మెయిన్‌ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టి ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలని సమావేశంలో తీర్మానించారు. అలాగే భోగాపురం ఎయిర్‌పోర్టును అందుబాటులోకి తీసుకొచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అభినందనలు తెలిపారు. విమానాశ్రయం అందుబాటులోకి రావడం...