VISWAM VOICE
Newspaper Banner
Date of Publish : 22 October 2026, 9:22 pm Posted by : shaikansar.ali37@gmail.com

ఉపాధ్యాయ ఓటర్ల నమోదు ప్రక్రియపై తహసిల్దార్ సమీక్ష….

Mandapeta, East Godavari (VISWAM VOICE DESK):

మండపేట తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల నేపథ్యంలో నూతన ఓటర్ల నమోదు ప్రక్రియను వేగవంతం చేయడంపై మండపేట తహశీల్దార్ పి. తేజేశ్వరరావు గురువారం అత్యవసర సమావేశం నిర్వహించారు. మండపేట తహశీల్దార్ కార్యాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో పాటు జూనియర్, డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు. ఓటర్ల జాబితా పునఃసిద్ధీకరణలో భాగంగా అర్హులైన ఉపాధ్యాయులు, సంబంధిత ఓటర్లను నూతనంగా నమోదు చేసేందుకు ఫారం-19 ద్వారా దరఖాస్తులు చేయించాలని సహాయ ఓటరు నమోదు అధికారి, తహశీల్దార్ పి. తేజేశ్వరరావు సూచించారు. అర్హులైన వారు ఓటరుగా నమోదు కావడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని, సంబంధిత విద్యాసంస్థల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు ఈ ప్రక్రియలో సమన్వయంతో వ్యవహరించాలని సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారులు నాయుడు రామచంద్రరావు, చింతా వెంకట సోమిరెడ్డి, పలువురు ప్రధానోపాధ్యాయులు, కళాశాలల ప్రిన్సిపాళ్లు, ఎన్నికల ఉప తహశీల్దార్ పి.ఎ. మెహర్ బాబా, ఎన్నికల సీనియర్ సహాయకుడు ఎం. పద్మనాభం పాల్గొన్నారు.