ఉపాధ్యాయ ఓటర్ల నమోదు ప్రక్రియపై తహసిల్దార్ సమీక్ష….

Mandapeta, East Godavari (VISWAM VOICE DESK): మండపేట తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల నేపథ్యంలో నూతన ఓటర్ల నమోదు ప్రక్రియను వేగవంతం చేయడంపై మండపేట తహశీల్దార్ పి. తేజేశ్వరరావు గురువారం అత్యవసర సమావేశం నిర్వహించారు. మండపేట తహశీల్దార్ కార్యాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో పాటు జూనియర్, డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు. ఓటర్ల జాబితా పునఃసిద్ధీకరణలో భాగంగా అర్హులైన ఉపాధ్యాయులు, సంబంధిత ఓటర్లను నూతనంగా నమోదు...