02:51 PM, 2 Tuesday March 2021

ఢిల్లీలో రైతుల పోరాటానికి మద్దతుగా ప్రజాసంఘాల ఆధ్వర్యంలో బంద్ ప్రశాంతం

రంగంపేట, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

మండలం లో ప్రజా సంఘాలు అయినా సి ఐ టి యు మరియు యు టి ఎఫ్ మరియు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రైతు చట్టాలు రద్దు చేయాలని మండలంలో మంగళవారం బందు నిర్వహించడం జరిగింది. రంగంపేట దేవి గుడి సెంటర్ నుండి ఏడిపి రోడ్ వరకు బంద్ ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ప్రజలు ,షాపుల వారు కూడా షాపులు మూసి వేసి రైతులకు మద్దతు తెలియజేశారు రైతు వ్యతిరేక ప్రజా వ్యతిరేక చట్టాలను మూడింటిని రద్దు చేయాలని 2020 విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని నల్ల చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీలో చలి లో 12 రోజులుగా పోరాటం చేస్తున్న రైతులకు మద్దతుగా ఈ బంద్ కి మద్దతు తెలియజేస్తామని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు ఇ.చంద్రావతి అన్నారు యుటిఎఫ్ నాయకులు రమేష్ మాట్లాడుతూ అన్నం పెట్టే రైతులు పోరాటం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం తక్షణం రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో మండల సిఐటియు కార్యదర్శి ఎన్.ఈశ్వరి మిడ్ డే మీల్ నాయకులు ఎన్. అమ్మాజీ, లక్ష్మి, ఆశ వరలక్ష్మి ,పద్మ, అంగన్వాడి జయ జానకి వెంకటలక్ష్మి ,జ్యోతి ,ఎస్ఎఫ్ఐ నాయకులు: వై భాస్కర్ , యు.చిన్నవీరాజు,ప్రజా సంఘాల నాయకులు సత్యనారాయణ ,నాగరాజు, యుటిఎఫ్ కార్యకర్తలు తదితరలు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#