03:54 AM, 3 Wednesday March 2021

రైతుల అదనపు ఆదాయానికే పాడి పరిశ్రమ

◘ రాష్ట్ర పశుసంవర్ధక డెయిరీ అభివృద్ధి మత్సశాఖల మంత్రి డా. సీదిరి అప్పలరాజు
◘ వైయస్సార్ హెల్త్ క్లినిక్ రైతు భరోసా కేంద్రాలను శంకుస్థాపన చేసిన మంత్రి, ఎంపీ మార్గాని భరత్ రామ్, ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి

బిక్కవోలు, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

రైతే దేశానికి వెనెముకని, పాడి వున్న చోట సిరులపంట వుంటుందని, రైతులకు అదనపు ఆదాయం కొరకు పాడి పరిశ్రమ అత్యంత ప్రధానమని రాష్ట్ర పశుసంవర్ధక డెయిరీ అభివృద్ధి మత్సశాఖల మంత్రి డాక్టరు సీదిరి అప్పలరాజు అన్నారు. శనివారం ఆయన బిక్కవోలు మండల పరిధిలోని కొమరిపాలెం గ్రామంలో ఐసిడిపి నిధులైన సుమారు రూ 42.50 లక్షల అంచనా విలువతో శ్రీలక్ష్మి ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన భవనానికి మరియు ఉపాధి హామీ నిధులు ఆరోగ్యశాఖ నిదులైన సుమారు రూ 15 లక్షల అంచనా విలువతో నిర్మించనున్న వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ (విలేజ్ వెల్‌నెస్ సెంటరు) నూతన భవనానికి, అలాగే సుమారు రూ 22 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న రైతుభరోసా కేంద్ర నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన శిలాఫలకాలను ఆవిష్కరించారు. అనంతరం స్థానికంగా సుమారు 400 పశువులతో నిర్వహించిన జిల్లా మెగా పశువైద్యశిభిరాన్ని మంత్రి ప్రారంబించి శిబిరంలో నిర్వహిస్తున్న పశుసాదారణ మందులు స్టాల్, సాంకేతితక సలహాలు సూచనలు స్టాల్, డివార్మింగ్ ప్రక్రియ, ఉత్పాదకత పెంపుదల చర్యల స్టాల్, పునరుత్పత్తి స్టాల్, శస్త్ర చికిత్సలు స్టాల్‌ను మంత్రివర్యులు స్థానిక పార్లమెంటు సభ్యులు మార్గాని భరత్ రామ్, స్థానిక ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డిలు ప్రారంబించారు. ఈ సందర్భంగా మంత్రి అప్పలరాజు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రైతులకు వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయం కన్నా వ్యవసాయానుబంధ రంగాల ద్వారా అదనపు ఆదాయం సముపార్జించుకోవాలనే ఉద్దేశ్యం పలు కార్యక్రమాలు ప్రవేశ పెడుతున్నారన్నారు. మెగా పశువైద్యశిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమని మొట్టమొదటిసారిగా శస్త్రచికిత్సలతో నిర్వహించిన పశువైద్యశిబిరాన్ని సర్వాంగ సుందరంగా నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు. పశువులకు వున్న వివిధ రకాల వ్యాధులను వైద్య పరీక్షలు ద్వారా గుర్తించి వాటికి అవసరమైన శస్త్ర చికిత్సలు అక్కడికక్కడే నిర్వహించారు. అదేవిధంగా పోషకాహార లోపాలను గుర్తించి మేలుజాతి పశుగ్రాసాలు ప్రదర్శించి వాటిని ఏవిధంగా పెంచి వశువులకు మేతా అందించాలని అంశాలను రైతులకు విశదీకరించారన్నారు. తాను కాకినాడ రంగరాయ వైద్యకళాశాలలో ఎంబిబిఎన్ కోర్సుపూర్తి చేసానన్నారు. స్థానిక శాసనసభ్యులు మా నియోజకవర్గంలో పశువైద్యశిభిరం నిర్వహించాలని కోరారని అదిశగా చర్యలు చేపట్టామని పశువైద్య సేవలు రైతులకు మరింత చేరువ చేయడానికి ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయి అన్నారు. పశుసంవర్ధక, మత్స్య శాఖ గోప్పదనం ఈ క్యాంపుల ద్వారా ప్రజలకు ఆ శాఖల సేవలు తెలుస్తాయన్నారు. గ్రామ సచివాలయాలు సేవలు మాదిరిగా అన్ని రకాలు ప్రభుత్వ సేవలు ప్రజలకు తెలపాలన్నారు. గతంలో మన పూర్వికులు మాదిరిగా పశువులను కొనుగోలు చేసి పెంచుకోవాలని పశువులలో ఉత్పాదకత పెంపుదల వాటి ఆరోగ్య పరిరక్షణకు వాటి నిర్వహణ ద్వారా సుస్థిర ఆదాయవనరులు ఏవిదంగా పొందాలన్న అంశాలపై ఆయా శాఖలు పూర్తి సహకారం చేయూతను అందిస్తాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి పశువులున్నాయని 10 వేలు ఆ బికెలున్నాయని ఒక్కొక్క ఆర్ బికె పశుసంవర్ధ సహాయకునికి 1000 పశువుల సంరక్షణ బాధ్యతను అప్పగించాలన్నారు. పశువుల సంరక్షణ కొరకు పశువైద్య సహాయకులు పాటుపడాలన్నారు. పశువులకు హెల్త్ కార్డులు జారీతోపాటు ఉచితంగా మందులు సరఫరా చేస్తున్నామన్నారు. ఆన్ లైన్ డేటా ఎంట్రి విధానం వలన ఏ పశువుకు ఏవిధమైన రోగంతో భాధపడుతుందో రాష్ట్ర వ్యాప్తంగా తెలుస్తోందన్నారు. పశువులకు అత్యవసర వైద్యం అవసరమైతే క్షేత్రస్థాయికి వెళ్లి వైద్యులు వైద్యసహాయం అందించడం జరుగుతోందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు అమూల్ సంస్థ ద్వారా పాల సేకరణ చేపట్టి లీటరుకు 4 రూపాయలు అదనపు రాబడికి చర్యలు తీసుకున్నారన్నారు. అమూల్ సంస్థ గుజరాత్ రాష్ట్రంలో గ్రామగ్రామాన సోసైటీలను జిల్లాలో యూనియన్లు రాష్ట్రంలో డరేషన్‌ను ఏర్పాటుచేసి పాల ఉత్పత్తులను అమ్ముతోందన్నారు. 1995 నుంచి పాలయూనియన్లు నిర్విర్యం అయ్యాయన్నారు. మహిళలతో పాల సొసైటీ ఏర్పాటు చేసి వాటికి అనుబంధంగా బల్క్ మిల్క్ యూనిట్లు ఏర్పాటుకు ఒక భవనాన్ని నిర్మిస్తున్నారన్నారు. ఈ విధంగా 9899 సోసైటీ ఏర్పాటుచేసి అమూల్ సంస్థ ఆయా పాలను సరఫరా చేస్తారన్నారు. వచ్చిన లాభాలను కూడా ఆయూల్ సంస్థ మహిళలకు పంచుతుందన్నారు. పాల సేకరణ రేటు పెంచితే రైతు బలోపేతం అవుతారన్నారు. రైతు ఆదాయం రెట్టింపు చేయాలని ముఖ్యమంత్రి భావించి పలు సంస్కరణలు ప్రవేశపెడుతున్నారన్నారు. దీనికొరకు సుమారు రూ 3200 కోట్లు వెచ్చించడం జరుగుతోందన్నారు. వైఎస్ఆర్ చేయూత, ఆసరా వెలుగు ద్వారా బ్యాంకు లింకేజ్ స్త్రీనిది కార్యక్రమాలు ద్వారా సేకరించిన నిధులతో గోర్రెలు మేకలు పశువులు యూనిట్లు కొనుగోలు చేసుకోవాలని అదే విధంగా జగనన్న జీవ కాంత్రి పధకాన్ని సద్వినియోగం చేసుకోని ఆర్ధికంగా బలపడాలన్నారు. గ్రామ స్వరాజ్యం , గ్రామ ఆర్ధిక వ్యవస్థ బలో పేతానికై గ్రామ సచివాలయ వ్యవస్థలు అందుబాటులోనికి వచ్చాయన్నారు. సుమారు రూ 720 కోట్లతో ఆక్వారంగానికి సబ్సిడి కరెంటును అందించామన్నారు. మత్స్యకార సంఘాలు ఐలోపేతానికి నాణ్యమైన చేపల సీదును అందించడం జరుగుతోందన్నా ప్లానికంగా ఒక మత్సకార సంఘానికి సీడును సరఫరా చేసామన్నారు. ఈ శిభిరంలో 40 కిపైగా శస్త్రచికిత్సలు నిర్వహించడం జరిగిందన్నారు. స్థానిక పశువు వైద్యశాలకు కొత్త భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామన్నారు. బహిరంగ ప్రదేశాలల వశువులు సంచరించకుండా ప్రభుత్వ స్థలాలను గుర్తించి పార్లమెంటు సభ్యులు సూచనల మేరకు ఆయా స్థలాలలో వాటిని కట్టడి చేయడం జరుగుతుందన్నారు. పార్లమెంటు సభ్యులు ఎం భరత్ రామ్ మాట్లాడుతూ కొమరి పాలెం గ్రామాభివృద్ధికి సుమారు రూ 7 కోట్ల మేర అభివృద్ధి పనులు నిర్వహణ కొరకు స్థానిక నాయకులు సత్తిబాబు పాటుపడ్డారన్నారు. కేంద్రప్రభుత్వం ఈ పశుసంవర్ధక శాఖకు బడ్జెట్ ను రెట్టింపు చేసిందన్నారు. ఈ రెండు రంగాలలో సాంకేతిక ఆచరణలోనికి తెవాలనే కృషిజరుగుతుందన్నారు. పంజరాలలో చేపల పెంపకానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ రెండు శాఖలకు మరింత వన్నె తేవాలని ఆయన మంత్రివర్యుల్నికోరారు. స్థానిక శానససభ్యులు ఎస్ సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ రూ 90 లక్షలతో అభివృద్ధి పనులుకు శంకుస్థావన చేయడం శుభపరిణామమన్నారు. జిల్లా స్థాయిలో మెగా వశువైద్య శిబిరం నిర్వహించడంలో మంత్రివర్యులు కృషి దాగివుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డిఒ గాందీ, మత్వశాఖ అదనపు సంచాలకులు కోటేశ్వరరావు, జెడి వివి సత్యనారాయణ, మార్కెట్ కమిటి అధ్యక్షులు సుబ్బారెడ్డి, నాయకులు పాపారెడ్డి, ముకుందరెడ్డి, ఎంపీడీఓ అనుపమ పరీష్, తాహసిల్దారు మాధవరావు తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#