◘ కష్ట కాలంలో ధరలు పెంచి దోచేస్తున్న జగన్ రెడ్డి సర్కారు
◘ స్కీముల కోసం సామాన్యుల నెత్తిన ట్యాక్సుల పిడుగు
◘ సంపద సృష్టించడం మాని .. అప్పులు చేస్తూ .. సామాన్యులపై భారం
◘ వైఎస్సార్సీపీ పాలనపై టీడీపీ నేతలు ధ్వజం
రాజమహేంద్రవరం సిటీ, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :
”అమ్మాలంటే అడవి – కొనాలంటే కొరివి” అన్నట్లుంది రాష్ట్రంలో నిత్యావసరాల ధరల పరిస్థితని తెలుగుదేశం పార్టీ నేతలు పేర్కొన్నారు. అటు రైతులకు గిట్టుబాటు ధరల్లేవు, ఇటు వినియోగదారులు కొనాలంటేనే భయపడేలా ధరలున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని, పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రంచాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం ఆధ్వర్యంలో, తెలుగు మహిళ సారధ్యంలో స్థానిక స్వామి థియేటర్ వద్ద వంటా – వార్పు కార్యక్రమం జరిగింది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెఎస్ జవహర్, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్ కుమార్, రాజమండ్రి పార్లమెంటరీ మహిళా కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి, నగర ప్రధాన కార్యదర్శి రెడ్డి మణేశ్వరరావు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కెఎస్ జవహర్ మాట్లాడుతూ జగన్ సర్కారు నిర్ణయాల వల్ల పేద, మధ్య తరగతి కుటుంబాల ఇంటి ఖర్చు గత ఏడాది కాలంలో భారీగా పెరిగిందన్నారు. ఒక్కో కుటుంబంపై రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు అదనపు భారం పడిందన్నారు. నిత్యావసరాల ఖర్చులు భారీగా పెరిగాయని, పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తున్నట్లు ప్రకటించి వ్యాట్ పెంచారని ఆరోపించారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా జగన్ అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే సామాన్యుల నడ్డి విరిచేలా ధరలు పెంచుకుంటూ పోతున్నారని మండిపడ్డారు. మనిషి జీవించేందుకు ఉపయోగపడే నిత్యావసర వస్తువుల ధరలతో పాటు గ్యాస్ ధరలు కూడా అధికంగా పెంచడం సరికాదన్నారు. ఆనాడు నారా చంద్రబాబు నాయుడు తెలుగింటి ఆడపడుచులు పుల్లల పొయ్యిపై వంట చేస్తుంటే చలించిపోయి వారి ఆరోగ్య రీత్యా ఆలోచించి ఆ రోజుల్లో 7 వేలు ఖరీదైన గ్యాసన్ను సబ్సీడీపై ఇంటింటికీ 700 రూపాయలకు ఇచ్చారని, అటువంటి గ్యాస్ ధరను పెంచి మహిళలను మళ్లీ కట్టెల పొయ్యికి అంకితం చేయాలని జగన్ నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ ప్రస్తుతం గ్యాస్ ధరలు పెంచి తెలుగింటి ఆడపడుచులను ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మహిళలను అన్ని రకాలుగా మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మహిళలను మభ్య పెట్టి అధికారంలోకి వచ్చి మహిళలను కించపరిచే విధంగా మహిళల నాడి పట్టాను.. అందుకే వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేస్తున్నామంటూ అవమానపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. మహిళలకు పావలా వడ్డీ అని, అమ్మఒడి అని, వృద్ధ మహిళలకు పెన్షన్ అని, రుణాలు మాఫీ చేస్తామంటూ నవరత్నాలు పేరుతో నవ రకాలుగా తప్పులు చేస్తున్న జగన్‌కు మహిళలు త్వరలోనే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గ్యాస్ ధర 600 రూపాయలు ఉండేదని, ప్రస్తుతం 675 రూపాయలకు పెరిగిందని, దానికి గ్యాస్ డెలివరీ చేసినందుకు అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి ఉందన్నారు. మాలే విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రస్తుతం కరోనా నేపధ్యంలో గ్యాస్ ధరలు పెంచడం వల్ల సామాన్య ప్రజలు ఇబ్బంది పడతారన్న ఆలోచన ఏ మాత్రం లేకుండా ధరలు పెంచడం సరైన విధానం కాదని, పెంచిన గ్యాస్ ధరను వెంటనే తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. మార్కండేయస్వామి ఆలయం ఛైర్మన్ మజ్జి రాంబాబు, మాజీ కార్పొరేటర్లు ద్వారా పార్వతి సుందరి, కడలి రామకృష్ణ, తంగెళ్ళ బాబి, బెజవాడ రాజ్‌కుమార్, సింహా నాగమణి, మర్రి దుర్గా శ్రీనివాస్, గరగ పార్వతి, మజ్జి పద్మ, కప్పల వెలుగు కుమారి, రాజమండ్రి పార్లమెంటరీ మహిళా కమిటీ ప్రధాన కార్యదర్శి దేవకృప, మరుకుర్తి రవియాదవ్, బుడ్డిగ రవి, అగురు ధన్రాజు, గరగ మురళి, కంటిపూడి రాజేంద్రప్రసాద్, పితాని కుటుంబరావు, కడితి జోగారావు, తురకల నిర్మల, కేబుల్ మురళి, మజ్జి శ్రీనివాస్, కురగంటి త్రినాధ్, గుణవర్తి శివ, అడ్డగర్ల ఆనంద్, చొక్కాకుల వెంకటేశ్వరరావు, చొక్కాకుల ప్రకాష్, ముత్యాల శ్రీను, చింతా జోగినాయుడు, సత్యనారాయణ, నాయుడు మాస్టారు, ఉర్లంకల లోకేష్, మీసాల నాగమణి, బర్ల గిరిజ, కిలపర్తి నాగభూషణం, యర్రంశెట్టి రాజ్‌కుమార్, బంగారు నాగేశ్వరరావు, నీలాపు వెంకటేశ్వరరావు, నేమాలి శ్రీను, 42వ వార్డు కేవీ శ్రీనివాస్, వానపల్లి శ్రీను, తుల్లి పద్మ, అంగులూరి నాయుడు, రాజబాబు, దంగేటి అన్నవరం, కె లక్ష్మీ నాయుడు, కానేటి ప్రభు, కానేటి కృపామణి, సత్తిబాబు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.