05:17 AM, 3 Wednesday March 2021

డిసిసిబి చైర్మన్ గా అనంతబాబు పాలనకు ఏడాది పూర్తి

◘ ఎటపాకలో వైకాపా పార్టీ శ్రేణుల సంబరాలు
◘ వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు , రగ్గులు పంపిణీ

ఎటపాక, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

తమ ఆదర్శనేత , ఏజెన్సీ ప్రాంత అభివృద్ధి కోసం నిత్యం శ్రమిస్తున్న నాయకులు , జిల్లా డిసిసిబి చైర్మన్ అనంత ఉదయ్ భాస్కర్ (బాబు) జిల్లా డిసిసిబి చైర్మన్ గా బాధ్యతలు చేపట్టి నేటికి ఏడాది పూర్తయిన సందర్భంగా ఎటపాక మండల కేంద్రంలోని సొసైటీ కార్యాలయం నందు వైకాపా మండల కమిటి మరియు సమన్వయ కమిటి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు మంగళవారం కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి అనంతబాబుకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎటపాకలోని సరోజిని వృద్ధాశ్రమంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సీఐ గీతారామకృష్ణ హాజరై వృద్దులకు అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన వృద్దులకు రగ్గులు , పండ్లు అందజేశారు. వైకాపా మండల కమిటి మరియు సమన్వయ కమిటి ఆధ్వర్యంలో వృద్ధుల మధ్య నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మండలంలోని వైకాపా నాయకులు మాట్లాడుతూ తమ నేత జిల్లా డిసిసిబి చైర్మన్ గా భాద్యతలు స్వీకరించి విజయవంతంగా ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వృద్ధుల మధ్య సంబరాలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో రాజన్న బిడ్డ జగనన్న ప్రభుత్వంలో మరిన్ని పదవులు చేపట్టి ఏజెన్సీ ప్రాంత ప్రజలకు అండగా నిలవాలని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటి చైర్మన్ ఆకుల.వెంకటరామారావు(పెద్దోడు) , రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి గోసు.ప్రశాంత్ (చింటు), జిల్లా కార్యదర్శి కొవ్వూరి రాంబాబు , జిల్లా నాయకులు కురినాల వెంకటేశ్వర్లు(బుజ్జి), మహిళా సీనియర్ నాయకురాలు దామెర్ల రేవతి , జిల్లా నాయకులు డేగల రామకృష్ణ , రాంబాల నాగేశ్వరావు , బాచినేని రామకృష్ణ , చోడవరం ఎంపిటిసి ఎలమోల రమేష్ , దుద్దుకూరి.వెంకటేశ్వరరావు , దొంతు.నాగేశ్వరావు , అప్పలరెడ్డి , చందు , సుకోనాయక్ ,  రవి ,సంతపూరి వెంకటేశ్వర్లు(నాని), బుయ్యని గణేష్ (గట్టు),గజ్జల శ్రీనివాస్ , సంఘం.బాలు ,లక్ష్మణ్ , కోటి మరియు మండల నాయకులు ,కార్యకర్తలు , అభిమానులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#