విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :
రెండు వారాల్లో రెండు తుఫానులతో కకావికలం అయిన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను ఇప్పుడు.. మరో తుఫాన్ భయపెడుతోంది. దీనికి అర్నాబ్ అనే పేరును కూడా పెట్టారు. నివర్, బురేవి తర్వాత దూసుకొస్తున్న అర్నాబ్.. బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. మూడవ తుఫాన్ కు ఈ పేరును బంగ్లాదేశ్ సూచించింది. అర్నాబ్ తుఫాన్ ఉదృతమైతే.. దీని ప్రభావం తమిళనాడుకు ఎక్కువగా ఉంటుంది. మన రాష్ట్రంలోని కోస్తా ప్రాంతాలకు కూడా తాకిడి ఉండచ్చు. ఇప్పటివరకూ సముద్రంలోనే కేంద్రీకృతమైన ఈ తుఫాన్ గమనాన్ని వాతావరణ శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. ఇది ఎప్పుడు ఎలా ప్రయాణిస్తుందన్న విషయం మరో రెండు రోజుల్లో తెలియజేస్తారు అధికారులు