ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ సాగు పద్ధతులపై రైతులకు రెండు రోజుల శిక్షణ
TADIPALLI (RAMACHANDRAPURAM), Dr. B.R. Ambedkar Konaseema (VISWAM VOICE DESK): భూసార పరిరక్షణ, సాగు ఖర్చుల తగ్గింపు, పంట దిగుబడుల పెంపుపై అవగాహన ఆత్మ ఆధ్వర్యంలో రామచంద్రపురం మండలం తాడిపల్లి గ్రామంలో ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం, భూసార పరిరక్షణ పద్ధతులపై రెండు రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రైతులకు ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ సంచాలకులు బి. నాగకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రైతు శిక్షణ కేంద్రం...