GOKAVARAM, East Godavari (VISWAM VOICE DESK):
గోకవరం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న మాతృశ్రీ గుబ్బాలమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వినాయకుడి చవితి ఉత్సవాలు రెండవ రోజు ఘనంగా నిర్వహించారు. మండలంలో ఎక్కడ లేని విధంగా అతి పెద్ద వినాయక విగ్రహాన్ని పెట్టడంతో నలుమూలల గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామి దర్శించుకుంటున్నారు. వరసిద్ధి వినాయక గుబ్బాలమ్మ తల్లి కాంప్లెక్స్ యూత్ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. 13 రోజులు పాటు ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని కమిటీ సభ్యులు తెలిపారు. అనంతరం భారీ ఊరేగింపు ఒక కార్యక్రమం ఉంటుందని తెలిపారు. రెండవ రోజు భక్తులతో వినాయకుడి ప్రాంగణమంతా కిటకిటలాడింది.