04:57 AM, 3 Wednesday March 2021

మనం మన పరిశుభ్రత నిర్వహించిన అధికారులు

ఆత్రేయపురం, విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్ :

మన ఆరోగ్యం మన  చేతుల్లోనే ఉందని మండల ఎంపీడీవో నాతీ బుజ్జి పేర్కొన్నారు. మండలం పరిషత్ కార్యాలయం లో మంగళవారం మనం మన పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. ఇందులో  భాగంగా అందరు పంచాయతీ కార్యదర్శులు, అన్ని శాఖల మండల స్థాయి అధికారులతో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించి పరిసరాల పరిశుభ్రత కు పాటుపడతామనీ, ప్రజల భాగస్వామ్యంతో వ్యర్థాలను తొలగించేందుకు కృషి చేస్తామని అందరూ ప్రతిజ్ఞ చేసారు. రైతులు, విద్యార్థులు, డ్వాక్రా మహిళలు, ఉపాధి హామీ వేతనదారులు , దుకాణదారులు అన్ని వర్గాల వారిని ఈ ఉద్యమం లో భాగస్వామ్యం చేస్తూ, వారి అలవాట్లలో మార్పు వచ్చేలా, వ్యర్థాలను రీ సైక్లింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలని తాహశిల్దార్ రామకృష్ణ అన్నారు. వాలంటీర్ల ద్వారా ప్రతీ ఇంటికి ఈ సమాచారం చేరాలని పంచాయతీ విస్తరణాదికారి శ్రీనివాస్ తెలిపారు.  అపరిశుభ్రతే వ్యాదులకు కారణం కాబట్టి పరిశుభ్రత పై దృష్టి సారించి, ప్రభుత్వం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు నిర్వహించాలని మెడికల్ ఆఫీసర్ శ్రీనివాసవర్మ అన్నారు. సమావేశం సమావేశానంతరం నిర్వహించిన ర్యాలి  కార్యక్రమం లో వ్యవసాయ అధికారి మృదుల, ఏపీఓ రామకృష్ణం రాజు, మండల విద్యా శాఖాదికారి ప్రసాదరావు, హౌసింగ్ ఏఈ శ్రీనివాస్, అందరు పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తెలంగాణ

ప్రధాన వార్తలు

Join Our Telegram Group
#
#
#