Mandapeta, East Godavari (VISWAM VOICE DESK):
35వ వార్డులో కూటమి అభ్యర్థి కురుపూడి రామకృష్ణకు మద్దతుగా వేగుళ్ల అజయ్ కుమార్ ఇంటింటా ప్రచారం….
మండపేట పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతో పాటు పట్టణ సుందరీకరణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని మున్సిపల్ చైర్పర్సన్ కూటమి టీడీపీ అభ్యర్థి వేగుళ్ల అజయ్ కుమార్ పేర్కొన్నారు. మండపేట పురపాలక సంఘ ఎన్నికల నేపథ్యంలో 35వ వార్డు టీడీపీ కూటమి కౌన్సిలర్ అభ్యర్థి కురుపూడి రామకృష్ణ విజయాన్ని కాంక్షిస్తూ ఆయన వార్డులో విస్తృతంగా ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి కూటమి అభ్యర్థులను గెలిపించాలని అభ్యర్థించారు.ఈ సందర్భంగా వేగుళ్ల అజయ్ కుమార్ మాట్లాడుతూ తమ కుటుంబానికి మండపేట ప్రజలతో తరతరాలుగా విడదీయరాని అనుబంధం ఉందన్నారు. తన తాత సర్దార్ వేగుళ్ల వీర్రాజు పంచాయతీ సర్పంచ్ స్థాయి నుంచి ఏకగ్రీవ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా దశాబ్దాల పాటు ప్రజలకు సేవలందించారని గుర్తుచేశారు. అదేవిధంగా తన పెదనాన్న, ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మున్సిపల్ చైర్‌పర్సన్‌గా మండపేట అభివృద్ధికి విశేష కృషి చేశారని పేర్కొన్నారు.వారి అడుగుజాడల్లోనే నడుస్తూ మండపేటను మరింత సుందరమైన పట్టణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. తరతరాలుగా తమ కుటుంబాన్ని ఆదరిస్తున్న మండపేట ప్రజల రుణాన్ని ఈ జన్మలో తీర్చుకోలేమని భావోద్వేగంతో పేర్కొన్నారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పట్టణ సమగ్రాభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నారు.35వ వార్డు అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా తనను, సౌమ్యుడిగా పేరొందిన వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కురుపూడి రామకృష్ణను సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో అమలాపురం టీడీపీ పార్లమెంట్ వాణిజ్య విభాగం అధ్యక్షులు ఉంగరాల రాంబాబు, మల్లిపూడి గణేష్, వల్లూరి గోవిందు, టిడిపి సీనియర్ నాయకులు , మాజీ కౌన్సిలర్ బండి గోవిందు, నల్లి రోజారాణి, కడియాల శ్రీను, కడియాల నాగదుర్గారావు, దారా లోవరాజు, పితాని రామకృష్ణ, కేతా చంద్రరావు, సుంకర ప్రసాద్, ముని సూరిబాబు, వేముల శ్రీరామమూర్తి, నాయుడు రామమూర్తి (రాంబాబు), కేశరి విద్యాసాగర్, సత్తి శ్రీను, కొంతం ప్రసాద్, గోళ్ళ శ్రీను, రావూరి శివ తదితర కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.