విశ్వంవాయిస్ న్యూస్, రాజానగరం రూరల్
రాజమహేంద్రవరం, విశ్వం వాయిస్ న్యూస్:
కుల మతాలకు అతీతంగా తరలి వచ్చి జరుపుకుంటున్న ఈ కార్తిక వన సమారాధన మహోత్సవం మనలోని సమైక్యతకు ప్రతిబింబం అని రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ టీకే విశ్వేశ్వర రెడ్డి అన్నారు. ఆదివారం కేశవరం రోడ్డు లో సంపత్ నగరంలోని రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ ఆవరణలో కార్తిక వన మహోత్సవం ఘనంగా జరిగింది.
తొలుత స్కూల్ ఆవరణలో గణపతి పూజ నిర్వహించి, గోశాలలో గోమాతను కూడా పూజించి, పంచముఖ ఆంజనేయ స్వామి గుడిలో పూజలు జరిపి, శివ కేశవులకు ప్రతీక అయిన ఉసిరి చెట్టుకు ప్రణమిల్లారు.
ఈ సందర్భంగా డాక్టర్ టీ.కే విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ కార్తీక వన సమారాధన మహోత్సవం ఆధ్యాత్మికతతో పాటు సంస్కృతిలోని నిబద్ధతను, తద్వారా సమతా భావాన్ని ప్రస్ఫుటం చేస్తుందని వివరించారు. దాదాపు వెయ్యిమందికి పైగా కుల మతాలకు అతీతంగా కార్తిక వన సమారాధన లో పాల్గొనడం పట్ల విశ్వేశ్వర రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ వన సమారాధనలో ఇనుమడించిన సమైక్యత భావం సమాజ అభివృద్ధికి తోడ్పాటును అందించాలని ఆకాంక్షించారు.ఈసందర్భంగా హార్స్ రైడింగ్, స్కేటింగ్, బాక్సింగ్ పోటీలు, సంగీత విభావరి,డాన్స్ బేబీ డాన్స్ పోటీలు నిర్వహించారు.
అనంతరం విజేతలకు ఓఎన్జీసీ విశ్రాంత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డీ.ఎం.ఆర్. శేఖర్ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు.వన సమారాధన కార్యక్రమంలో ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ కర్రి రామారెడ్డి పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా డాక్టర్ రామారెడ్డి గారిని విశ్వేశ్వర్ రెడ్డి గారు సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మార్టిన్ లూథర్, వడయార్, వై.శ్రీనివాస్, కె.శ్రీహరి బాబు, వెలగా రామకృష్ణ , బి.గంగారావు, టి.సూరిబాబు, కడియం రాజు, చిన్నం మురళీ కృష్ణ , కారింకి వెంకటేశ్వరరావు, కాకి శివ కిశోర్, ఎం.భద్రం, దుంప చంద్రా రెడ్డి, నక్కా రాజబాబు, బొదిరెడ్ల అప్పారావు రెడ్డి, మమత బ్రహ్మానందరెడ్డి, బీఎన్ రెడ్డి, రాంపండు రెడ్డి, ఎస్.వి.వి.రెడ్డి, భాస్కర శర్మ, మోతా శారద, ఎన్.ప్పారావు, సి.హెచ్.ఎస్. వీరభద్ర రావు, అబ్దుల్లా షరీఫ్, కాంగ్రెస్ పార్టీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రాజమహేంద్రవరం రెడ్డి సంఘం సభ్యులు, రాజమహేంద్రి విద్యా సంస్థల కుటుంబ సభ్యులు తేతలి స్వరూప్ రెడ్డి, తేతలి సత్య సౌందర్య, తేతలి ఉమా మహేశ్వరి, మితాక్షి మేఘన రెడ్డి తదితరులు పాల్గొన్నారు.