Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ఏసీబీకి చిక్కిన విఆర్ఓ

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

ఏసీబీకి చిక్కిన విఆర్ఓ

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ కాజులూరు మండలం బంధనపూడి గ్రామ సచివాలయ వీఆర్వో పామర్తి సూర్యచంద్రరావు

విశ్వంవాయిస్ న్యూస్, కాజులూరు:

కాకినాడ జిల్లా కాజులూరు మండలం బంధన పూడి విఆర్వో 6000 రూపాయలు ఒక రైతు వద్ద నుండి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు శనివారం పట్టుబడ్డారు. ఏసీబీ అడిషనల్ ఎస్పీ సౌజన్య మీడియాతో మాట్లాడుతూ బంధనపూడి గ్రామసచివాలయ వీఆర్వోగా పనిచేస్తున్న పామర్తి సూర్యచంద్రరావును గొల్లపాలెం సెంటర్లో తలాటం వెంకటేష్ వద్ద నుండి 6000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డారని, బాధిత రైతు తలాటం వెంకటేష్ గత కొద్ది రోజులుగా తన 30 సెంట్లు భూమి పాసుబుక్ కొరకు ఆన్లైన్లో అప్లై చేయడానికి వీఆర్వో చుట్టూ తిరుగుతున్న అతను 6000 రూపాయలు డిమాండ్ చేయడంతో తలాటం వెంకటేష్ ఏసీబీ అధికారులకు కంప్లైంట్ ఇచ్చారని, ఈ కంప్లైంట్ ఆధారంగా శనివారం సంబంధిత విఆర్ఓ వద్దకు వచ్చి తనిఖీలు చేయడంతో నగదుతో పట్టుబడ్డారని అన్నారు. వీఆర్వోను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని అన్నారు. ఏసీబీ అడిషనల్ ఎస్పీ సౌజన్య మాట్లాడుతూ ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచండిమాండ్ చేస్తే 14400 నెంబర్ కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని తెలిపారు. రైతు తలాటం వెంకటేష్ మాట్లాడుతూ విఆర్ఓ ఇలా ఇబ్బంది పెడుతున్నాడని మీరైనా స్పందించాలని అధికారులతో సంప్రదించినప్పుడు సంబంధిత అధికారులు కూడా అంతగా పట్టించుకోలేదని అందువల్లనే ఏసీబీ ని సంప్రదించానని, ఇలా చాలాచోట్ల రైతులు వద్ద అధికారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రైతులు అష్ట కష్టాలు చేసి పంటను పండిస్తుంటే ఏదైనా ఇలాంటి అధికారుల వద్దకు వచ్చినప్పుడు అధికారులకు డబ్బులు ఇవ్వకుండా పనులు జరగట్లేదని రైతు తలాటం వెంకటేష్ అన్నారు. వెంకటేష్ మాట్లాడుతూ ఏ సి బి అధికారులపై నమ్మకంతో తన పని ముందుకు సాగాలని పాస్ బుక్ ఫైల్ అన్ని పనులు సక్రమంగా జరగాలని ఏసిబి అధికారులపై నమ్మకం ఉందని వెంకటేష్ తెలిపారు . ఈదాడులలోఏసీబీ అడిషనల్ ఎస్పీ సౌజన్య రాజమహేంద్రవరం ఏసీబీ కార్యాలయం నుంచి ఎస్సై విల్సన్ ఇన్స్పెక్టర్లు వాసు కృష్ణ, శ్రీనివాసరావు,సతీష్ ఈ దాడులను పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement