రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి ధూళిపూడి బాబి
విశ్వంవాయిస్ న్యూస్, తాళ్లరేవు:
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ చేస్తున్న యువగలం పాదయాత్రకు వస్తున్న ఆదరణను చూసి వైసిపి నాయకులు తట్టుకోలేక యువగలం వాలంటీర్లను అరెస్టులు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి ధూళిపూడి వెంకటరమణ (బాబి) ఒక ప్రకటనలో ఆరోపించారు. లోకేష్ చేస్తున్న యువగలం పాదయాత్రకు ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందని దాన్ని తట్టుకోలేక వైసీపీ నాయకులు ఇలాంటి పరిస్థితులకు తెగిస్తున్నారని ఆరోపించారు. వైసిపి నాయకులు ఇలా చేయడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిగజారుడుతనానికి నిదర్శనమని అన్నారు. ఎవరు ఎన్ని చేసినా త్వరలో వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే అని ప్రజలందరూ చంద్రబాబు సీఎం చేయాలని అనుకుంటున్నారని అన్నారు. 2024లో తప్పక తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని బాబి అన్నారు.