Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on March 19, 2024 7:43 AM

ACTIVE

India
44,499,261
Total active cases
Updated on March 19, 2024 7:43 AM

DEATHS

India
533,523
Total deaths
Updated on March 19, 2024 7:43 AM
Follow Us

అనంత బాబు మూడో బెయిల్ పిటిషన్ను తిరష్కరణ -ఎస్సీ ఎస్టీ కోర్టు సంచలన తీర్పు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

బాధితుల తరపున వాదించిన ఆంధ్ర ప్రదేశ్ పౌర హక్కులు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ళ సుబ్బారావు

-ఈ నెల 27న న్యాయస్థానంలో ముప్పాళ్ళ వాదనలు

-చార్జిషీట్ దాఖలు చేసినంత మాత్రాన బెయిల్ ఇవ్వరాదు

-సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులను కోర్టుకు అందజేత.

-వైఎస్ వివేకనంద కేసుకు అనంత బాబు కేసుకు చాలా పోలికలని వాదన ముద్దాయి గత నేర చరిత్రను పరిగణనలోకి తీసుకోవాలి.

-అధికార పార్టీకి చెందిన పలుకుబడి కల్గిన వ్యక్తి కాబట్టి సాక్షులను ప్రభావితం చేయవచ్చని వాదన

-ముప్పాళ్ళ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం

-రెండు బెయిల్ అప్లికేషన్లను కొట్టివేసిన ఎస్సీ ఎస్టీ కోర్టు న్యాయమూర్తి ఎం. నాగేశ్వరరావు

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమహేంద్రవరం సిటీ:

-బాధితుల తరపున వాదించిన ఆంధ్ర ప్రదేశ్ పౌర హక్కులు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ళ సుబ్బారావు

-ఈ నెల 27న న్యాయస్థానంలో ముప్పాళ్ళ వాదనలు

-చార్జిషీట్ దాఖలు చేసినంత మాత్రాన బెయిల్ ఇవ్వరాదు

-సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులను కోర్టుకు అందజేత.

-వైఎస్ వివేకనంద కేసుకు అనంత బాబు కేసుకు చాలా పోలికలని వాదన ముద్దాయి గత నేర చరిత్రను పరిగణనలోకి తీసుకోవాలి.

-అధికార పార్టీకి చెందిన పలుకుబడి కల్గిన వ్యక్తి కాబట్టి సాక్షులను ప్రభావితం చేయవచ్చని వాదన

-ముప్పాళ్ళ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం

-రెండు బెయిల్ అప్లికేషన్లను కొట్టివేసిన ఎస్సీ ఎస్టీ కోర్టు న్యాయమూర్తి ఎం. నాగేశ్వరరావ

రాజమహేంద్రవరం విశ్వం వాయిస్ న్యూస్ క్రైమ్;

దళిత యువకుడ్ని అతి కిరాతకంగా హత్య చేసి డోర్ డెలివరీ చేసిన అధికార పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు బెయిలు కొరకు వేసుకున్న మూడవ బెయిలు అప్లికేషన్ ను • పోలీసు వారు నిర్దేశించిన సమయంలో పూర్తి చార్జిషీట్ దాఖలు చేయలేదు కాబట్టి చట్టబద్ధంగా తప్పనిసరిగా బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వేసిన మరొక పిటిషన్ మంగళవారం ఎస్సీ ఎస్టీ కోర్టు న్యాయమూర్తి ఎం.నాగేశ్వరరావు కొట్టివేస్తూ తీర్పు చెప్పారు. బాధితులకు అండగా బాధిత కుటుంబం తరఫున ముద్దాయి. వేసుకున్న బెయిలు పిటిషన్ ను కొట్టివేయాలని కోరుతూ ప్రముఖ న్యాయవాది, ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ముప్పాళ్ళ సుబ్బారావు వాదించారు.రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వైసిపి ఎమ్మెల్సీ అనంత బాబు కేసులో సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులను పరిగణనలోకి తీసుకుని అతను బెయిల్ కొరకు వేసుకున్న మూడో బెయిల్ పిటిషన్ ను తిరష్కరించాలని ప్రముఖ న్యాయవాది, ఏపి పౌర హక్కుల సంఘం (ఏపిసిఎల్ఎ) రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ళ సుబ్బారావు ఈ నెల 27 వ తేదీ శనివారం న్యాయ స్థానంలో జరిగిన వాదనల్లో కోరారు. రాజమండ్రిలోని ఎస్సీఎస్టీ ప్రత్యేక న్యాయస్థానంలో ఎమ్మెల్సీ అనంత బాబు కేసుకు సంబం ధించి వాద ప్రతివాదనలు జరిగాయి. బాధితుల తరఫున న్యాయవాది ముప్పాళ్ళ సుబ్బారావు తన వాదనలు. వినిపించారు. గత నేర చరిత్ర కల్గిన ఎమ్మెల్సీ అనంత బాబుకు బెయిల్ మంజూరు చేస్తే బాధిత కుటుంబా నికి..సాక్షులకు ప్రమాదమని, వారికి ప్రాణాపాయం ఉంటుందని ముప్పాళ్ళ వాదించి ఉన్నారు. చార్జిషీట్, వేసినంత మాత్రాన సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం ముద్దాయిలను విడుదల చేయావలసిన అవసరం లేదని సుప్రీంకోర్టు తీర్పును న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన వైఎస్,వివేకనందా రెడ్డి హత్య కేసుకు.. అనంత బాబు కేసుకు అనేక దగ్గర పోలికలు ఉన్నాయని వివరించారు. వైఎస్ వివేకనంద రెడ్డి హత్య కేసులో ముద్దాయిలుగా ఉన్న ముగ్గురు వ్యక్తులకు ఈ నెల 1 వ తేదీన ముద్దాయి లు వేసుకున్న బెయిల్ పిటిషన్ను తిరస్కరిస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల కాపీని ప్రస్తావించి.. న్యాయస్థానానికి అందజేయడం జరిగింది, వైఎస్ వివేక హత్యకేసులో రెండు సార్లు చార్జిషీట్ దాఖలు చేసినా.. బెయిల్ను తిరస్కరించిన విషయాన్ని న్యాయ స్థానం దృష్టికి తీసుకువచ్చారు.

అనంత బాబుకు గత నేర చరిత్ర…

గతంలో రౌడీషీటు (నెంబర్ 62) కల్గి ఉన్న విషయాలను పరిగణనలోకి తీసుకుని బెయిల్ మంజూరు చేయరాదని ముప్పాళ్ళ అన్నారు. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పులను న్యాయస్థానానికి అందించి వాటిని పరిగణనలోకి తీసుకోవాలని వాదించారు.ఈ కేసులో ఇంకా సాంకేతిక ఆధారాలను..జిపిఎస్, కాల్ డేటా తదితర వాటి ఆధారంగా విచారణాధికారి దర్యాప్తులో మిగిలిన పాత్రధారుల ప్రమేయం ఉందని నిర్ధారణ అయితే.. అడిషనల్ చార్జిషీట్ వేయవచ్చన్నారు. జ్యూడిషియల్ కస్టడీలో లేని వ్యక్తికి బెయిల్ మంజూరు చేయడం సాధ్యం కాదని ముప్పాళ్ళ వాదించారు. దీనిపై బాధితుల తరఫున న్యాయవాది ముప్పాళ్ళ మెమోలను పరిగణనలోకి తీసుకోరాదని..విచారణాధికారి పూర్తి చార్జిషీట్ వేసారని..దానిలో అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని వివరించారు. సుప్రీం కోర్టు, హైకోర్టు తీర్పులను పరిశీలించి ముద్దాయికి బెయిల్ ఇవ్వరాదని బాధితుల తరపున ముప్పాళ్ళ చేసిన వాదనలను విన్న న్యాయమూర్తి నాగేశ్వరరావు..తీర్పును మంగళవారం ఇచ్చారు.ఎమ్మెల్సీ అనంత బాబు వేసుకున్న రెండు బెయిల్ పిటిషన్లను కొట్టివేస్తూఎస్సీ ఎస్టీ కోర్టు న్యాయమూర్తి ఎం. నాగేశ్వరరావు తీర్పును వెలువరించారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement