46
రాయవరం, విశ్వం వాయిస్ న్యూస్: శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఆలయ ప్రాంగణంలో వైకుంఠ ఉత్తర ద్వార దర్శన మహోత్సవం గోడ పత్రికను రాయవరం గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్, తెదేపా సీనియర్ నాయకులు వుండవిల్లి రాంబాబు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాంబాబు మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి పర్వదినాన శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం మహోత్సవం నిర్వహణకు ముక్కోటి ఏకాదశి ఉత్సవ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసిందని భక్తులందరూ పాల్గొని స్వామి వారి యొక్క ఆశీస్సులు పొందాలని తెలియజేశారు. అనంతరం స్వామి వారి దేవాలయానికి దేవల వీర వెంకట సత్యనారాయణ చౌదరి (మురళీమోహన్ చౌదరి) సుమారు 45 వేల రూపాయల విలువ చేసి దీపారాధన స్టీలు స్టాండ్లను, మల్లిడి శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులు స్వామివారి ఆలయ ప్రాంగణంలో భద్రత చర్యలు నిమిత్తం 50 వేల రూపాయలు విలువ చేసే సీసీ కెమెరాలు సంబంధిత సామాగ్రి, స్వామివారికి బంగారు ఆభరణాలు సమకూర్చుట కొరకు గ్రామానికి చెందిన ఆండ్ర పెద్ద వీర్రాజు లక్ష రూపాయల విరాళం ఉండవెల్లి రాంబాబు చేతుల మీదుగా ఆలయ కమిటీకి బహూకరించారు. వీరిని దేవస్థానం కమిటీ, గ్రామస్తులు, అభివృద్ధి కమిటీ చైర్మన్ రాంబాబు అభినందించారు. ఈ కార్యక్రమంలో ముక్కోటి ఏకాదశి కమిటీ సభ్యులు పులగం. శ్రీనివాసరెడ్డి (మెడికల్ షాపు), వల్లూరి. శ్రీనివాసు, పులగం. శ్రీనివాసరెడ్డి(పి ఎస్ ఆర్) సత్తి. వెంకట సుబ్బారెడ్డి, చల్లా. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.