– బీసీ సంక్షేమం మంత్రి వేణు
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, గొల్లపాలెం:
కాజులూరు, విశ్వం వాయిస్:
గతంలో ఏ ప్రభుత్వమూ అందించలేనన్ని సంక్షేమ పథకాలు మూడేళ్ళలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసి చూపించారని రాష్ట్ర బిసి సంక్షేమ, సినిమాటోగ్రఫీ, సమాచార, పౌర సంబంధాల శాఖా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ పేర్కొన్నారు.
మంగళవారం కాజులూరు మండలం గొల్లపాలెం గ్రామంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలసి రాష్ట్ర బిసి సంక్షేమ, సినిమాటోగ్రఫీ, సమాచార, పౌర సంబంధాల శాఖా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని ప్రతీ ఇంటికి తిరుగుతూ సంక్షేమ కార్యక్రమాలు సక్రమంగా అందుతన్నదీ లేనిదీ కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. పేద ప్రజల ఉన్నతికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా కొంత మంది కొన్ని సమస్యలపై మంత్రికి విజ్ఞప్తి చేయగా వెంటనే అధికారులు, సచివాలయ సిబ్బందితో మాట్లాడి పరిష్కారం చూపాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కుల మతాలు, పార్టీలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. గతంలో పథకాల లబ్ధి కోసం కాళ్లరిగేలా తిరిగినా పేద ప్రజలకు ప్రయోజనం ఉండేది కాదన్నారు. మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చక్కటి సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా అర్హులైన ప్రతీ ఒక్కరికీ పారదర్శకంగా ఎవరి ప్రమేయం లేకుండా నేరుగా గడపవద్దకే ప్రతీ పథకాన్ని అందజేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వివరించారు. ఈ సందర్భంగా సంక్షేమ పథకాల లబ్ధి నేరుగా అందుతుండటంతో ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎటువంటి అవినీతికి తావులేకుండా సుపరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రికి ప్రజలంతా అండగా నిలవాలని మంత్రి ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట జడ్పిటిసి వనుము సుబ్బారావు, ఎంపిపి మాతా భారతి, సర్పంచ్ పోతురాజు ప్రసన్న మౌనిక, ఎంపీటీసీ జె.సత్య పద్మజ, మండల అధికారులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.