విశ్వంవాయిస్ న్యూస్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా:
*బౌద్ధ దమ్మ మహామాత్ర సమావేశం*
జిల్లా అధ్యక్షులు మట్ట సిద్ధార్థ గౌతమ్ అధ్యక్షతన
ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షులు మట్టా వెంకట్రావు
అమలాపురం టౌన్ విశ్వం వాయిస్ న్యూస్
అంబేద్కర్ కోనసీమ జిల్లా,అమలాపుర బుద్ధిష్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా డాక్టర్ బి.ఆర్.అంబెడ్కర్ కోనసీమ జిల్లా సమావేశం స్థానిక జిల్లా కార్యాలయం నందు జిల్లా అధ్యక్షులు మట్టా సిద్ధార్థ గౌతమ్ అధ్యక్షతన జరిగినది. ఈ సమావేశమునకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షులు మట్టా వెంకటరావు హాజరైనారు. ఈ సమావేశంలో ఈ నెల 21.05. 2023న విజయవాడలోని ఉండవల్లి రాష్ట్ర కార్యాలయం రాజ గృహ నందు జరిగిన బౌద్ధ దమ్మ మహామాత్ర శిక్షణకు సంబంధించిన విషయాలను చర్చించడం జరిగినది. ఆరోజు జరిగిన సమావేశంలో బౌద్ధ సాంప్రదాయం ప్రకారం నిర్వహించు సంస్కారాల గురించి ఇచ్చిన శిక్షణను తప్పనిసరిగా అనుసరించాలని ఉపాసకులకు తెలిపారు. శిక్షణ పొందిన వారు మాత్రమే వివాహము,గృహప్రవేశము, జన్మదిన వేడుకలు తదితర సంస్కారాలు చేయవలసి ఉందని సమావేశంలో తెలిపారు. శిక్షణ పొందిన వారికి అర్హత ధ్రువపత్రాలను ఇవ్వడం జరిగింది. అలాగే వివాహము చేసుకొను వధూవరులు వివాహమునకు ముందే ‘ *దమ్మ దీక్ష* ‘ తప్పనిసరిగా స్వీకరించవలెను. అలాగే వివాహానికి ముందుగానే బౌద్ధ ఉపాసకులు/దమ్మ మహా మాత్రలను సంప్రదించవలెను. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాలో శిక్షణ పొందిన వారు- మట్టా సిద్ధార్థ గౌతమ్, కాశి.వి.వి సత్యనారాయణ,(టీచర్) కాశి. పరశురాం బోధి, పెట్టా.వెంకట్రావు, ధోనిపాటి.ఆంజనేయులు, నందికి.ధనరాజ్, మేకల.మీరా సాహెబ్,కాశి.వి.వి సత్యనారాయణ, పినిపే.రాధాకృష్ణ, కోలా.త్రిమూర్తులు, సాకా.రాజారావు, చింతపల్లి.శివ, కవల.రమేష్, నందికి.శ్రీనివాసు, వాకపల్లి.భీమారావు, గిడ్ల.రమేష్ ఉండ్రు.బాబ్జి, దాకారపు.చిరంజీవి,దడాల. రాజశేఖర్,పెనుమాల.సుధీర్.లు మాత్రమే శిక్షణ పొందిన ఉపాసకులు, వీరు మాత్రమే బి ఎస్ ఐ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కలిగి ఉన్నారన్నారు.