విశ్వంవాయిస్ న్యూస్, రాయవరం
మండలం పసలపూడి కళానగర్ శ్రీ యేసు కరుణాలయంలో క్రిస్టమస్ వేడుకలు ఘనంగా జరిగాయి. బుధవారం యేసు కరుణాలయం యూత్ అధ్యక్షతన జరిగిన ఈ పండుగలో క్వయర్ బృందం వారు క్రిస్మస్ గీతాలు పాడుతూ క్రీస్తును ఆరాధించారు. క్యాండిల్ సర్వీస్ నిర్వహించిన అనంతరం పాస్టర్ చిర్రా దీవెన కుమార్ క్రిస్మస్ సందేశం అందించారు. ఈ వేడుకలో మాజీ జెడ్పిటిసి కర్రీ వెంకటకృష్ణారెడ్డి ( జడ్పిటిసి కృష్ణ), ప్రముఖ పారిశ్రామికవేత్త చైతన్య రాజబాబు లు పాల్గొని మాట్లాడుతూ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని యేసు సూచించిన మార్గంలో పయనించి ప్రజలందరూ ప్రేమ కలిగి జీవించాలని అన్నారు. ఈ వేడుకల్లో స్త్రీల సమాజం, సండే స్కూల్ విద్యార్థులు, పాల్గొన్నారు.