విశ్వంవాయిస్ న్యూస్, రాయవరం:
గుడ్ ఫ్రైడే క్రీస్తును శిలువ వెయ్యటం, కల్వరి వద్ద అతని మరణం యొక్క జ్ఞాపకాలను గుర్తుచేసుకొనే క్రైస్తవమత విశ్వాసకులకి ప్రాథమికంగా ఒక సెలవు దినం. ఈ సెలవు దినం పవిత్ర వారం సమయంలో పవిత్రమైన మూడు రోజులలో భాగంగా ఈస్టర్ ఆదివారానికి ముందు వచ్చే శుక్రవారం రోజున ఆచరించబడుతుంది, దీనిని హోలీ ఫ్రైడే, బ్లాక్ ఫ్రైడే లేదా గ్రేట్ ఫ్రైడే అని కూడా పిలువబడుతుంది. క్రీస్తు సువార్తల ఆధారంగా క్రీస్తును శిలువ వెయ్యటం దాదాపుగా శుక్రవారమే జరిగింది. గుడ్ ఫ్రైడే పురస్కరించుకుని క్రీస్తు శిరసున ముళ్ళ కిరీటం రూపాన్ని అద్భుతంగా చిత్రీకరించారు. సమాజంలో జరిగే ప్రతీ పండుగ సందర్భాన్ని తన కుంచెతో వర్ణిస్తూ ఆయా సందర్భాల ప్రాముఖ్యత ను తెలియచేస్తానని రాయవరం గ్రామానికి చెందిన ఇండుగమెల్లి సౌదాగర్ తెలిపారు. గత పది సంవత్సరాలుగా తను ఆర్టిస్ట్ గా అనేక చిత్రాలను వేసి అందించానని విద్యార్థులకు చిత్ర లేఖనం పైన అవగాహన పెంచేందుకు డ్రాయింగ్ టీచర్ గా మెలకువలు నేర్పిస్తున్నానని తెలియజేశారు. అంతేగాక ఇప్పటివరకు అనేక చిత్రాలను రూపొందించారని, సౌదాగర్ మంచి కళా నైపుణ్యం కలిగిన వ్యక్తి అంటూ గ్రామాల్లోని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.