విశ్వంవాయిస్ న్యూస్, రాయవరం
రాయవరం, విశ్వం వాయిస్ న్యూస్: మండల కేంద్రమైన రాయవరం గ్రామానికి చెందిన చిత్రకారుడు ఇండుగమిల్లి సౌధాగర్, క్రైస్తవులకు ప్రాముఖ్యమైన పండగగా పిలవబడే క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని, క్రీస్తు జనన ఇతివృత్తాన్ని ఇసుక గువ్వరాతిపై చిత్రీకరించి వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు, ప్రపంచమంతా జరుపుకునే పండుగ క్రిస్మస్ మాత్రమే అని, అందుకోసమే వాటర్ కలర్స్ తో రెండు గంటలు సమయం వెచ్చించి గువ్వరాతి పై చిత్రాన్ని లిఖించి నట్లు స్థానిక విలేఖరులకు తెలియజేశారు.