స్ధానిక పాస్టర్ల ఆద్వర్యంలో వేడుకలు
క్రీస్తు రాకలోని పరమార్థాన్ని వివరించిన దైవ జనులు
చిన్నారుల సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు
క్రీస్తు రాకలోని పరమార్థాన్ని వివరించిన దైవ జనులు
చిన్నారుల సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు
విశ్వంవాయిస్ న్యూస్, రాయవరం
- రాయవరం, విశ్వం వాయిస్ న్యూస్: మండలం లోని క్రైస్తవ సంఘాలలో స్ధానిక పాస్టర్స్ ఆద్వర్యంలో క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఘనంగా వేడుకలు నిర్వహించారు. మండల కేంద్రమైన రాయవరం లో 24వ తేది మంగళవారం రాత్రి నుండి హెబ్రోను చర్చ్ దైవజనురాలు సి.హెచ్ బేబిరాణి , అపోస్తలిక్ చర్చి పాస్టర్ అనిల్ స్ధానిక యూత్ వారి ద్వారా కీర్తనలు , క్యాండిల్ సర్వీస్ వంటి కార్యక్రమాలతో వేడుకలు ప్రారంభించారు, ఈ సందర్భంగా క్రైస్తవులను ఉద్దేశించి క్రీస్తు రాకలోని పరమార్థాన్ని దైవజనులు చార్లెస్ తెలియచేస్తూ, పరలోకంలో దేవునిగా కొలవబడుతూ ప్రపంచాన్ని నిర్మించిన దేవుడు పసి బాలుడుగా మానవ శరీరాన్ని ధరించి వచ్చారని, ప్రపంచంలో గొప్పవారిగా పిలవబడిన వారు ఎందరో రాజ్యాలను జయించారు కానీ తమ దేహంతో పాపాన్ని జయించలేకపోయారని అన్నారు , ఏసుక్రీస్తు ముప్పై మూడున్నర సంవత్సరములు శరీరంలో ఏ పాపం చేయకుండా బ్రతికి, సిలువ మరణం ద్వారా ప్రపంచానికి పాప విముక్తి కలిగించి, మరణించి, సమాధిలో పెట్టబడి, మరణాన్ని జయించి తిరిగి లేచారని ఆయనలా జీవించి మనము పాపాన్ని జయించాలని క్రీస్తు నేర్పిన మార్గాలను ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో అన్వయించుకోవాలని వర్తమానం ద్వారా క్రిస్మస్ సందేశం అందించారు, 25 వ తేదీ బుధవారం స్థానిక లూధరన్ దేవాలయం వారు పాస్టర్ గిరిబాబు ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు, ఆర్కెస్ట్రా సింగర్స్ రత్న కుమార్,అనిల్ కుమార్ లు క్రీస్తు గీతాలను సుమధురంగా ఆలపించి సంగీతం అందించారు, అనంతరం పాస్టర్ గిరిబాబు క్రిస్మస్ సందేశమిస్తూ క్రీస్తు శరీరధారిగా భూమి మీదకు వచ్చారని, ఆయన సామాన్యుడు కాదని కాలాన్ని లెక్కించడానికి అనగా క్రీస్తుపూర్వం, క్రీస్తు శకం అని కాలాన్ని రెండుగా విభజించింది క్రీస్తు మాత్రమేనని ఆయన అందించిన శాంతి మార్గాన్ని ప్రతి ఒక్కరూ అవలంబించాలని తద్వారా పరలోకం పొందుకోవాలని బోధించారు. అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేసి స్వీట్స్ అందించారు చిన్నారుల సాంస్కృతిక నృత్యాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో చాణిక్య నర్సింగ్ హోమ్ అధినేత డాక్టర్ జి .ఎస్ .ఎన్. రెడ్డి, మండల కో ఆప్సన్ సభ్యులు పోలమాటి సుధాకర్, పాస్టర్ సిహెచ్ సురేష్ , సంఘ సభ్యులు, స్త్రీల సమాజం, సండే స్కూల్,సంఘం పెద్దలు ,యూత్ , తదితరులు పాల్గొన్నారు.