విశ్వంవాయిస్ న్యూస్, anakapalli
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అస్తమయం చెందారు. ఆయన మృతి రాజకీయాలకు అతీతంగా అందరినీ విషాదానికి గురిచేసింది. మన్మోహన్ మృతి నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారం రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది.
రేపటి (డిసెంబరు 27) ప్రభుత్వ కార్యక్రమాలన్నింటినీ రద్దు చేశారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో కేంద్ర క్యాబినెట్ సమావేశం కానుంది. కాగా, మన్మోహన్ సింగ్ అంత్యక్రియలను పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని నిర్ణయించారు.