విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఆలమూరు:
ఆలమూరు ( విశ్వం వాయిస్ న్యూస్): పూల తోటల పై వచ్చు తెగుళ్ళును సకాలంలో గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని డాక్టర్ వైయస్సార్ ఉద్యానవన విశ్వవిద్యాలయం, ఎస్కెపిపి ఉద్యానవన పాలిటెక్నికల్ కళాశాల ప్రిన్సిపాల్ సిహెచ్ చిన్నబ్బాయి తెలిపారు. కోనసీమ జిల్లా ఆలమూరు మండలం బడుగువానిలంకలో బంతి, చామంతి, కనకాంబరం వంటి పూల తోటలతో పాటు దొండ, జామ, అరటి వంటి ఉద్యానవన పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బంతి, చామంతి, పూలతోటలలో పువ్వుల పరిమాణం, దిగుబడిపై రైతులకు అవగాహన కల్పించారు. అలాగే బంతిపై శనగపచ్చ పురుగు నివారణ చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం సహాయక అధ్యాపకురాలు డాక్టర్ అనూష, ఉద్యానవన సహాయక అధికారి (ఎన్హెచ్ఏ) ఏ లావణ్య, పలువురు అధికారులు, రైతులు పాల్గొన్నారు.