విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమహేంద్రవరం సిటీ:
చేనేత, హస్తకళా ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా కళాకారులను ప్రోత్సహించాలని రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్‌మెంట్ అధారిటీ ఛైర్‌పర్సన్ మేడపాటి షర్మిలరెడ్డి అన్నారు. స్థానిక శ్రీ ఉమా రామలింగేశ్వర కళ్యాణమండపంలో ఈనెల 5 నుంచి 20వ తేదీ వరకు నిర్వహిస్తున్న చేనేత, హస్త కళాశాల ప్రదర్శన, అమ్మకాలను షర్మిలరెడ్డి ఆదివారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా షర్మిలరెడ్డి మాట్లాడుతూ స్వదేశి హాండీక్రాప్ట్ సొసైటీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాలలోని కళాకారులు తమ ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుందన్నారు. ప్రదర్శనలో ఉంచిన ఉత్పత్తులు ఎంతగాను ఆకట్టుకుంటు న్నాయన్నారు.ప్రతిఒక్కరు ప్రదర్శను సందర్శించి, ఉత్పత్తులు కొనుగోలు చేయాలని కోరారు.శ్రీ ఉమా రామలింగేశ్వరస్వామి కళ్యాణమండపం ఛైర్మన్ కాలెపు సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ ఉమారామలింగేశ్వర కళ్యాణమండపం ఇటువంటి ప్రదర్శనలు నిర్వహణకు వేదికగా నిలుస్తుందన్నారు. ఉత్పత్తులు కొనుగోలు చేయడం ద్వారా కళాకారులను ప్రోత్సహించా లన్నారు. నిర్వాహకులు చిరంజీవి రాంబాబు మాట్లాడుతూ ప్రదర్శన అమ్మకాలలో భాగంగా హేండ్‌లూమ్స్‌పై 20శాతం, హేండ్రీక్రాప్ట్స్‌పై 10 శాతం డిస్కౌంట్ లభిస్తుందని తెలిపారు. పోచంపల్లి టై అండ్ డై, నారాయణపేట, గద్వాల్, వెంకటగిరి జరీ చీరలు, మంగళగిరి, గుంటూరు చీరలు, సిల్క్ కాటన్ చీరలు, చండేరి పాటూరు చీరలు,కాటన్ ప్రింటెడ్ చీరలు,చేనేత దుప్పట్లు,కర్టెన్స్,బంజారా,గాగ్రా డ్రసెస్,టివి కవర్స్, సోపా కవర్స్, టవల్స్, నర్సాపురం లేసులు, ఖాదీ మెటీరియల్,1గ్రామ్ గోల్డ్ నగలు, కొండపల్లి బొమ్మలు, ఏటికొప్పాక బొమ్మ, కొయ్యతో చేసిన బొమ్మలు, రోజ్‌వుడ్, సారంగపూర్ వస్తువులు, బ్లాక్ మెటల్ వస్తువులు, వెంటి మత్యాలు ఆభరణాలు, ఇత్తడి వస్తువులు,నారపీచు వస్తువుల, సిరామిక్ వస్తువుల,స్పటిక,రుద్రాక్ష మాలలు, అందమైన టెర్రకోట పూల కుండీలు, లెదర్ వస్తువుల, అగర్‌బత్తీలు ఇంకా అనేక రకాల వస్తువులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షులు రొబ్బి విజయశేఖర్, బీర శ్యామలరావు తదితరులు పాల్గొన్నారు