విశ్వంవాయిస్ న్యూస్, రామచంద్రపురం:
డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అంబేద్కర్ కు అవమానం
దళిత జాతి బిడ్డ పై జరిగిన అవమానం యావత్ ప్రపంచం చూస్తుంది
భారత రాజ్యాంగ నిర్మాతకు మనం ఇచ్చే గౌరవం ఇదేనా
భావితరాలుకు ఇలాంటి ఘటనలుతో ఎమ్ చెప్పాలనుకుంటున్నారు
రామచంద్రపురం మండలం వెల్ల గ్రామంలో డాక్టర్ బి ఆర్.అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను తక్షణమే అరెస్టు చేయాలి
దళిత, ప్రజా సంఘాలు ఆందోళన
అంబేద్కర్ విగ్రహన్ని ధ్వంసం చేసిన దుండగులను వారం రోజులు లోపు అరెస్టు చేస్తామని హామీ ఇచ్చిన రామచంద్రపురం డీ.ఎస్ పి .
రామచంద్రపురం నియోజకవర్గం విశ్వం వాయిస్ డాక్టర్ బి ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వెల్ల గ్రామ స్థానిక అరుంధతి పేట,జగనన్న లేఅవుట్ వద్ద ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని దళితులు 9 సంవత్సరాల క్రితం అంబేద్కర్ మరియు బాబు జగ్గజీవన్ రాయ్ విగ్రహాలను ఏర్పాటు చేశారు.అప్పటి నుండి ఇద్దరు నాయకులకు జయంతి, వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.నిన్న రాత్రి గుర్తు దుండగులు అంబేద్కర్ విగ్రహాన్ని గునపం తో పగలకొట్టి విగ్రహాన్ని తల,మెండం న్ని ధ్వంసం చేశారు.ఈ విషయం తెలుసుకున్న దళిత,ప్రజా సంఘాల నాయకులు విగ్రహం వద్దకు పెద్ద ఎత్తున తరలివచ్చారు.వెల్ల గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారును అరెస్టు చేయాలని,దుండగులను తక్షణమే అరెస్టు చేయాలని, అంబేద్కర్ విగ్రహాలకు రక్షణ కల్పించాలని నినాదాలు చేశారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పీడీఎస్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి బి.సిద్ధూ, రామచంద్ర పురం ఎస్.సి, ఎస్.టీ ఫెడరేషన్ అధ్యక్షులు పొలినాటి ప్రసాద్,బుంగా రాజు,ఎమ్ ఆర్ పి ఎస్ రాష్ట్ర సలహాదారుడు మోర్త దొరబాబు,ఎం.ఆర్.పి.ఏస్ నియోజక కన్వీనర్ చిర్రా సురేష్,అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు వి. భీమ శంకరం,ప్రజా సేన అధ్యక్షడు కాటే సుబ్రహ్మణ్యం తదిరులు మాట్లాడుతూ వెల్ల గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం అంటే దళితులు మీద,దళిత జాతిపై దాడి చేయడమే అన్నారు. అంబేద్కర్ ను అవమాన పర్చడం అంటే దళిత జాతి ఆత్మ గౌరవాన్ని అవమాన పర్చడం అన్నారు.అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు ఎవరైనా పోలీస్ లు తక్షణమే అరెస్టు చేయాలని , కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.రామచంద్ర పురం డీఎస్పీ,సీఐ,ఎస్.ఐ లు దళిత, ప్రజా సంఘాల నాయకులు కు వారం రోజులు లోపు అరెస్టు చేస్తామని హామీ ఇచ్చారు. దళిత,ప్రజా సంఘాలు వారం రోజులు లోపు అరెస్టు చేయకపోతే రామచంద్ర పురం నియోజక వర్గం లో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని పోలీస్ లను ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వికలాంగుల హక్కుల వేదిక అధ్యక్షుడు,పి రాజు,ఏపి రైతు కూలీ సంఘం నాయకులు కొండ దుర్గా రావు,ఎం ఎస్ ఎఫ్ నాయకులు మహేష్,పి . వినయ్ కుమార్,వి.రామకృష్ణ, గుబ్బల శ్రీను తదితర దళిత,ప్రజా సంఘాల నాయకులు ఉద్యమంలో పాల్గొన్నారు.