జంతు సంరక్షణ నోడల్ అధికారిగా అడిషనల్ ఎస్పీ కె.వి.వి. సత్యనారాయణ నియామకం.

కాకినాడ, మే 13 ( విశ్వం వాయిస్ క్రైమ్ న్యూస్):

కాకినాడ జిల్లాలో జంతు మరియు పశు సంరక్షణ చట్టాలను మరింత కఠినంగా అమలు చేసేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం నడుం బిగించింది. జిల్లా ఎస్పీ జి. బిందుమాధవ్ ఉత్తర్వుల మేరకు, జిల్లా జంతు సంరక్షణ నోడల్ అధికారిగా ఇంచార్జ్ అడిషనల్ ఎస్పీ , ఎస్బీ డీఎస్పీ కె.వి.వి. సత్యనారాయణను నియమిస్తూ జిల్లా పోలీస్ కార్యాలయం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది.పశువుల అక్రమ రవాణా, అక్రమ వధ వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపడమే లక్ష్యంగా ఈ నియామకం జరిగినట్లు ఎస్పీ తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా జంతువులపై క్రూరత్వం లేదా అక్రమ తరలింపులు గమనిస్తే ప్రజలు నేరుగా నోడల్ అధికారి మొబైల్ నెంబర్ 94407 96513కు సమాచారం అందించాలని ఆయన కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, నిందితులపై తక్షణమే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.

संबंधित समाचार

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

ताजा खबर