విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపాల్‌గా వి. నవీన్ బాధ్యతల స్వీకరణ

రాయవరం, విశ్వం వాయిస్ న్యూస్

స్థానిక విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నూతన ప్రిన్సిపాల్‌గా . నవీన్ బాధ్యతలు స్వీకరించారు. కార్పొరేట్ విద్యాసంస్థల్లో అడ్మినిస్ట్రేషన్ మరియు బోధనా రంగాల్లో ఆయనకు ఉన్న సుదీర్ఘ అనుభవాన్ని పరిగణలోకి తీసుకుని, ఈ నియామకం చేపట్టినట్లు స్కూల్ కరస్పాండెంట్ డాక్టర్ శేషవేణి మల్లిడి ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా డాక్టర్ అమ్మిరెడ్డి మల్లిడి మరియు పాఠశాల అధ్యాపక బృందం నవీన్ కి పుష్పగుచ్ఛాలు అందజేసి, హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.బాధ్యతల స్వీకరణ అనంతరం నవీన్ మాట్లాడుతూ..మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి (అనుగుణంగా విజ్ఞాన్ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే తన ప్రథమ ప్రాధాన్యత అని పేర్కొన్నారు. విద్యార్థుల్లో క్రమశిక్షణను పెంపొందించడంతో పాటు, వారి సమగ్ర అభివృద్ధికి మరియు బోర్డు పరీక్షల్లో ఉత్తమ ఫలితాల సాధనకు పటిష్టమైన కార్యాచరణను అమలు చేస్తానని ఆయన వెల్లడించారు.

संबंधित समाचार

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

ताजा खबर