విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఆలమురు:
ఆలమూరు ( విశ్వం వాయిస్ న్యూస్ ): గ్రామాల పరిశుభ్రతే ప్రధాన ధ్యేయంగా స్వచ్ఛభారత్ పేరుతో కేంద్ర ప్రభుత్వం గ్రామాలకు నేరుగా నిధులను కేటాయిస్తుందని, సంపూర్ణ పారిశుద్ధ్యం దిశగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్వచ్ఛభారత్ కన్వీనర్ పాలూరి సత్యానందం పిలుపునిచ్చారు కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మండలం పరిధిలో జొన్నాడ గ్రామంలో భారత్ కార్యక్రమాన్ని పాలూరి ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామంలో గల తారకరామ కాలనీ లో స్థానిక విద్యార్థులతో కలిసి ప్రత్యేక స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛభారత్ రాష్ట్ర కన్వీనర్ పాలూరి సత్యానందం, ఓబిసి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అయినవిల్లి సత్తిబాబు గౌడ్, మద్దిశెట్టి శ్రీను, కొవ్వూరి సీతారామ రెడ్డి, సుబ్బారావు, కాలా సురేష్ పలువురు పాల్గొన్నారు