చేస్తునందుకు గ్రామ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపిన
అడిషనల్ ఎస్. పి లతా మాధురి
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఆత్రేయపురం:
ఆత్రేయపురం( విశ్వం వాయిస్ న్యూస్) మార్పు అన్నది మనతోనే మొదలవుతుందని అడిషనల్ ఎస్.పి .లతా మాధురి పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామాల్లో అమలాపురం ఎన్ఫోర్సుమెంటు సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, కొత్తపేట ఎస్.ఈ.బి. శ్రీనివాస్ ఆధ్వర్యం లో జరిగిన పరివర్తన సదస్సు కి పాల్గొని ఆమె మాట్లాడారు, ప్రభుత్వ నిబంధనలు చట్టాలకు వ్యతిరేకంగా నాటుసారా తయారీకి ఉపాధిగా మలుచుకుని పోలీసులకు అధికారులకు పట్టుబడి కటకటాల పాలయి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే వారు అని అన్నారు. అయితే అటువంటి వారికి గ్రామాల్లో అవగాహన ద్వారా మార్పు చెందుతారు అనే ఉద్దేశంతో గ్రామ పెద్దల తో మాట్లాడి వారి ద్వారా ఎవరైతే సారా తీస్తూ ఉన్నారు. వారికి అవగాహన కల్పించడంతో మార్పు చెంది ఈరోజు నాటుసారా లేని గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని, అటువంటి గ్రామాలలో వెలిచేరు గ్రామం కూడా ఇప్పుడిప్పుడే స్వచ్చందంగా సారా తయారీ ని ఆపివేస్తూ, నిర్ణయం తీసుకున్న, సారా తయారీ దారుల్లో వచ్చిన మార్పు కు హర్షం వ్యక్తం చేస్తూ, ఈ మార్పు శాశ్వతం కావాలని కోరుచున్నట్లు అన్నారు.వెలిచేరు గ్రామం లో ఉన్న సారాయి ముద్దాయిలు, అనుమానితుల్ని అందరినీ బైండోవర్ చేయడం తో పాటు, అనేక సార్లు కౌన్సిలింగ్ చేయడం ద్వారా, వెలిచేరు గ్రామాన్ని సారా రహితం గా మార్చడం లో కృషి చేసిన, ఎస్.ఈ.బి., కొత్తపేట ఎస్.ఐ. సతీష్ ని అభినందించారు. ఈ పరివర్తన సదస్సు కి,, గ్రామ సర్పంచి, ఎం.పి.టి.సి., ఆత్రేయపురం పోలీసు ఎస్.ఐ. సుధాకర్ ,గ్రామ పెద్దలు, సచివాలయ సిబ్బంది,వలంటీర్లు మరియు సారా తయారీ ని వదిలి వేసిన పాత ముద్దాయిలు ఈ సదస్సు లో పాల్గొన్నారు.