విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాయవరం:
రాయవరం, విశ్వం వాయిస్ న్యూస్: పోలీస్ స్టేషన్ కు పదో తరగతి పరీక్ష పత్రాలు చేరుకున్నాయి. పదో తరగతి పబ్లిక్ పరీక్షల కోసం ముద్రించిన ప్రశ్న పత్రాలు మొదటి స్పెల్ మొదటి సెట్ శనివారం రాయ వరం పోలీస్టేషన్‌కు చేరుకున్నాయి. జిల్లా కేంద్రం నుంచి కట్టు దిట్టమైన భద్రత నడుమ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. రాయవరంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల, భాష్యం, పసలపూడి, చెల్లూరు పరీక్ష కేంద్రాలకు సంబంధించిన చీఫ్ సూపరింటెం డెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు ప్రశ్నపత్రాలను బాక్సుల్లో భద్రపర్చారు. మొదటి స్చెల్ మొదటి సెట్ (తెలుగు, ఇంగ్లీష్, హిందీ, గణితం) పరీక్ష పేపర్లు రాగా వాటిని తేదీల వారీగా బాక్సుల్లో భద్రపర్చి పోలీస్టేషన్‌లోని స్ట్రాంగ్లూమ్లో ఉం చారు. ఆదివారం మొదటి స్పెల్ రెండో సెట్, 28న రెండో స్పెల్ మొదటి సెట్ (ఫిజికల్ సైన్స్, బయాలజీ, సోషల్ స్టడీస్, సంస్కృతం, ఒకేషనల్, ఓ ఎస్ ఎస్ సి, 29న రెండో స్పెల్ రెండో సెట్ ప్రశ్నపత్రాలు పోలీస్ స్టేషన్లకు చేరుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఆయా ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు. పాత్రలు