వ్యక్తంచేసింది గన్నవరం యూటీఎఫ్
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, పి గన్నవరం:
పి గన్నవరం (విశ్వం వాయిస్ న్యూస్)
సిపిఎస్ రద్దు కొరకు యూటీఎఫ్ ఆధ్వర్యంలో విజయవాడలో చేపట్టనున్న పోరు గర్జనను పోలీసులు అడ్డుకొని యుటిఎఫ్ నాయకులను గృహనిర్బంధం చేయడంపై పి గన్నవరం లో యుటిఎఫ్ నాయకులు నిరసన చేపట్టారు. ఈ మేరకు యుటిఎఫ్ మండల అధ్యక్షుడు కడలి శివరామకృష్ణ ఆధ్వర్యంలో మండల తహాసిల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యుటిఎఫ్ నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఏమైనా పరిష్కారం కొరకు పోరాడుతున్న యుటిఎఫ్ నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం, గృహనిర్బంధం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ ప్రధాన కార్యదర్శి జి. శ్రీనివాస్, ఎం. సుందర్రావు, రాణి, రూప లక్ష్మీ, దుర్గ, కే శ్రీనివాస్, కొల్లాటి రవి, రాజు ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.