ఎస్ఈబి ఎస్సై అన్నవరం
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఆలమురు:
ఆలమూరు ( విశ్వం వాయిస్ న్యూస్): సారా అమ్మకాలు చేసిన అక్రమ రవాణా నిర్వహించిన అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు చేపడతామని ఆలమూరు ఎస్ఐ ఎస్ శివప్రసాద్, ఎస్ఈబి (ఎక్సైజ్) ఎస్ఐ ఎస్ అన్నవరం హెచ్చరించారు. ఆలమూరు సర్కిల్ ఎక్సైజ్ పరిధిలో గతంలో సారా తయారీ, రవాణా, అమ్మిన పాత నేరస్తులను సోమవారం 19మందిని బైండోవర్ చేసి ఆలమూరు తాసిల్దార్, ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ లక్ష్మీపతి ఎదుట హాజరుపరిచారు. ముందుగా వారందరికీ ఎస్సైలు శివప్రసాద్ అన్నవరంలు తాసిల్దార్ కార్యాలయం ఎదుట కౌన్సిలింగ్ ఇచ్చారు.