Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,139,558
Total recovered
Updated on December 10, 2022 4:23 AM

ACTIVE

India
5,522
Total active cases
Updated on December 10, 2022 4:23 AM

DEATHS

India
530,653
Total deaths
Updated on December 10, 2022 4:23 AM

ప్రజల రక్షణ… సంరక్షణ మన బాధ్యత

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

– సంక్షేమ పధకాలు ప్రజలకు అందించంలో కీలక పాత్ర
– జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా అధికారులకు ఆదేశాలు

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:

 

 

కాకినాడ, విశ్వం వాయిస్ః

ప్రస్తుతం నెలకొన్న అధిక ఉష్ణోగ్రతలు, వడగాడ్పుల నుండి ప్రజలకు రక్షణ, ఊరట కల్పించేందుకు జిల్లా వ్యాప్తంగా వేసవి సహాయక చర్యలను ముమ్మరంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా.కృతిక శుక్లా అధికారులను ఆదేశించారు.
సోమవారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో వివిధ వ్యక్తిగత, సామాజిక సమస్యలకు పరిష్కారం కోరుతూ మొత్తం 191 అర్జీలు ప్రజల నుండి అందాయి. వీటిలో అత్యధికంగా 176 అర్జీలు రెవెన్యూ శాఖకు సంబంధించి ఉన్నాయి. జిల్లా కలెక్టర్ డా.కృతిక శుక్లా, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, డిఆర్ఓ కె.శ్రీధరరెడ్డి, బిసి కార్పొరేషన్ ఈడి ఎస్.వి.ఎస్.సుబ్బలక్ష్మి ప్రజల నుండి అర్జీలు స్వీకరించి, వాటి సత్వర పరిష్కారం కొరకు సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
అలాగే స్పందన కార్యక్రమంలో పాల్గొన్న వివిధ శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించి అంతర శాఖల సమన్వయంతో పరిష్కరించాల్సిన సమస్యలు, నిర్వహించాల్సిన పనులను సమీక్షించి వాటిని పూర్తి చేసేందుకు గడువులను నిర్ధేశించారు.
జగనన్న కాలనీల లే అవుట్ లలో విద్యుత్ లైన్ల షిఫ్టింగ్, పంచాయతీలలో సాలిడ్ వేస్ట్ ప్రోసెసింగ్ సెంటర్లకు కరెంట్ సరఫరా అంశాలపై హౌసింగ్, పంచాయతీ, ట్రాన్స్కో అధికారులకు ఆదేశాలకు జారీ చేశారు. ఉపాధి హామీ పధకం క్రింద మైనర్ ఇరిగేషన్ పనులు చేపట్టేందుకు టెక్నికల్ శాంక్షన్ లు వెంటనే జారీ చేయాలని ఇరిగేషన్, డ్యామా అధికారులను ఆదేశించారు.
తీవ్రమైన వేసవి ఎండల దృష్ట్యా ప్రజల దాహార్తి తీర్చేందుకు వితరణశీలుల సహకారం, కార్పోరేట్ సామాజిక బాధ్యత సహాయాలతో అన్ని ఆవాసాల్లో చలివేంద్రాలు, చలువ పందిళ్లు ఏర్పాటు చేసి త్రాగు నీరు, మజ్జిగ పంపిణీ చేయాలని డిపిఓ,జడ్పీ సిఈఓ, ఆర్డబ్యూఎస్ ఎస్ఈ లను ఆదేశించారు. ప్రజలకు, పశువులకు త్రాగునీటి కొరత లేకుండా జిల్లాలోని సమ్మర్ స్టోరేజి చెరువులు అన్నిటినీ పూర్తిగా స్థాయి నింపాలని ఇరిగేషన్, ఆర్ డబ్యూ ఎస్ ఇంజనీర్లను ఆదేశించారు.
వడదెబ్బకు గురి కాకుండా కాపాడుకునేందుకు చేపట్ట వలసిన జాగ్రత్తలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని వైద్య ఆరోగ్య అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. అన్ని ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో వడదెబ్బకు గురైన వారి చికిత్సకు అవసరమైన మందుల నిల్వలు తగిన స్ధాయిలో సిద్దంగా ఉంచాలని సూచించారు. అలాగే పరిష్కార గడువు దాటిన అర్జీలు,రీ ఓపెన్ చేసిన ఆర్జీలపై పత్యేక సమీక్షించి అందుకు కారణాలను విశ్లేషించి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. కారుణ్య నియామకాల కొరకు 70 ధరఖాస్తులు అందాయని, నియామక ప్రక్రియ పూర్తి చేసేందుకు తమ శాఖల్లోని ఖాళీలు, రోస్టర్ వివరాలను ఇంకా సమర్పించని అధికారులందరూ వెంటనే అందజేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!